Himantha Biswa Sharma: అసోంలో ముస్లింల జనాభా 35 శాతానికి చేరుకుందని, ఇక నుంచి వారిని మైనారిటీలుగా పరిగణించలేమని, పరిగణించాల్సిన అవసరం కూడా లేదని హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Himantha Biswa Sharma: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. అసోంలో ముస్లింల జనాభా 35 శాతానికి చేరుకుందని, ఇక నుంచి ముస్లీంలను మైనారిటీలుగా పరిగణించలేమని, పరిగణించాల్సిన అవసరం కూడా లేదని హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990ల్లో కశ్మీరీ పండిట్ల వలసలను ప్రస్తావించారు. కనుక ఇతర సామాజిక వర్గాల్లో భయాందోళనను తగ్గించాల్సిన బాధ్యత, కర్తవ్యం ముస్లింలదేనని అన్నారు.
బుధవారం అస్సాం శాసనసభ బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. నేడు ముస్లిం సామాజిక వర్గ నేతలు విపక్షంలో ఉన్నారు.
ఎమ్మెల్యేలకు సమాన అవకాశాలు ఉంటాయి. అధికారాలు ఉపయోగించొచ్చు. కావున గిరిజనుల హక్కులు కాపాడటంలో, వారి భూమి ఆక్రమించబడకుండా చూడడం వారి కర్తవ్యమని తెలిపారు. 6వ షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదు. బొరా, కలిటా సామాజిక వర్గాల వారు తమ భూముల్లో స్థిర పడలేదన్నారు. కనుక ఆ భూముల్లో స్థిర పడిన ముస్లింలు తప్పుకోవాలన్నారు.
పీఎఫ్‌ఐని నిషేధించాలని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. "అధికారం బాధ్యతతో వస్తుంది" అని, అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నందున అసోంలో మైనారిటీలను రక్షణ కల్పించాల్సిన కర్తవ్యం ముస్లీంలపైనే ఉందని సిఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. అసోం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంస్కృతి, నాగరికత కాపాడబడతాయో? లేదోనన్న భయం నెలకొంది. సామరస్యం అనేది రెండు వైపుల విషయం. పదేళ్ల క్రితం మేం మైనారిటీలం కాదు, ఇప్పుడు మైనారిటీలమని అన్నారు. మే 2021 నుండి శర్మ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అతను తరచుగా ముస్లింలకు వ్యతిరేక ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు.
