Asianet News TeluguAsianet News Telugu

Ayodhya Ram Mandir : ఇది కదా మత సామరస్యమంటే .. అయోధ్య నుంచి ‘‘ రామజ్యోతి’’తో కాశీకి ముస్లిం మహిళలు

అయోధ్యలో మతసామరస్యం వెల్లివెరిస్తోంది. వారణాసికి చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్విన్‌లు పవిత్రోత్సవానికి ముందు తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్య నుంచి రామజ్యోతి (రామ్ టార్చ్) తీసుకుని ముస్లింలు నివసించే ప్రాంతాల్లో ఊరేగించడం వారి లక్ష్యం.

Muslim women from Varanasi to carry 'Ramjyoti' from Ayodhya to Kashi in communal harmony mission ksp
Author
First Published Jan 6, 2024, 9:42 PM IST

జనవరి 22న రామజన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామయ్యని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్యలో మతసామరస్యం వెల్లివెరిస్తోంది. వారణాసికి చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్విన్‌లు పవిత్రోత్సవానికి ముందు తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్య నుంచి రామజ్యోతి (రామ్ టార్చ్) తీసుకుని ముస్లింలు నివసించే ప్రాంతాల్లో ఊరేగించడం వారి లక్ష్యం. ప్రతి భారతీయుడి డీఎన్ఏ రాముడితో ముడిపడి వుందనే సందేశాన్ని వ్యాప్తి చేయడం ఈ ముస్లిం మహిళల ముఖ్యోద్దేశం. 

శనివారం ప్రారంభమయ్యే ఈ ప్రయాణాని గాను కాశీకి చెందని దోమ్‌రాజ్ ఓం చౌదరి, పాతాల్‌పురి మఠానికి చెందిన మహంత్ బాలక్ దాస్ అయోధ్యకు నజ్నీన్, నజ్మాలకు ఫ్లాగ్ చేస్తారు. అయోధ్యలో మహంత్ శంభు దేవాచార్య రామజ్యోతిని వారికి అప్పగిస్తారు. వీరిద్దరూ ఆదివారం రామజ్యోతితో పాటు అయోధ్య నుంచి మట్టి, సరయూ నదిలోని పవిత్ర జలంతో తిరిగి వారణాసికి చేరుకోవాలని భావిస్తున్నారు. వారి పని అక్కడితో ముగియదు. జనవరి 21 నుంచి రామజ్యోతి పంపిణీ ప్రారంభమవుతుంది. నజ్నీన్.. ఉర్దూలో హనుమాన్ చాలీసా, రామ్‌చరిత్ మానస్‌ను అనువదించారు. రామ్ భక్తిలో పాతుకుపోయిన సామాజిక సేవ చేస్తున్న రాంపంత్‌తో ఆమెకు అనుబంధం వుంది. ఈ విషయంలో తన గురువు మహంత్ బాలక్ దాస్‌ అడుగుజాడల్లో నజ్నీన్ నడుస్తున్నారు. 

అయోధ్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ నజ్నీన్ ఇలా అన్నారు. ‘‘ అయోధ్యలో రామ మందిరం నిర్మించబడినందుకు సంతోషంగా వుంది. ఎందుకంటే శ్రీరాముడు మా పూర్వీకుడు, ఒక వ్యక్తి తన మతాన్ని మార్చగలడు కానీ పూర్వీకులను కాదు. మక్కా ముస్లింలకు వున్నట్లే, అయోధ్య పవిత్ర స్థలం ’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీపై పీహెచ్‌డీ చేసిన నజ్మా 17 ఏళ్లుగా తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితం చేశారు. వారణాసిలోని హిందూ ముస్లిం డైలాగ్ సెంటర్ ద్వారా ముస్లింలు, హిందువుల మధ్య సఖ్యతను పెంచడంతో పాటు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. 

మత సామరస్యాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో 2006లో తీవ్రవాద దాడి తర్వాత సంకట్ మోచన్ ఆలయంలో అనేక మంది ముస్లిం మహిళలతో కలిసి హనుమాన్ చాలీసా పఠించినప్పుడు వారి ప్రయత్నాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాటి నుంచి వారు శ్రీరామనవమి, దీపావళిలను పురస్కరించుకుని వందలాది మంది ముస్లిం మహిళలతో శ్రీరామ హారతి నిర్వహించారు. అయోధ్య, పాతాల్‌పురి మఠానికి చెందిన ఆధ్యాత్మిక వ్యక్తులతో పాటు రాంపంత్ నాయకులు రామ్ పరివార్ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. జనవరి 22న పాతాల్‌పురి మఠంలో శ్రీరాముడిని ప్రతిష్టాపన వారి ప్రయత్నాలలో భాగమే. వారణాసి దాని పొరుగు జిల్లాల్లో రామజ్యోతి సందేశాన్ని వ్యాప్తి చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. 

ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ.. నజ్నీన్, నజ్మాలు జౌన్‌పూర్, వారణాసిలోని వివిధ ప్రదేశాలలో తిరిగి రావడాన్ని స్వాగతిస్తూ రామజ్యోతిని తిరిగి పొందేందుకు అయోధ్యకు వెళతారని గురుజీ ఉద్ఘాటించారు. వారణాసిలోని లమాహి గ్రామంలో ముస్లిం సమాజం జనవరి 7న సుభాష్ భవన్‌లో రామజ్యోతికి ప్రత్యేక స్వాగతం పలకనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios