హిందువుగా నమ్మించి ఇద్దరు అక్కాచెల్లళ్లతో పారిపోవడానికి స్కెచ్.. ఎలా దొరికాడంటే?
ఓ ముస్లిం వ్యక్తి తనను తాను హిందువుగా పరిచయం చేసుకుని ఇద్దరు అక్కాచెల్లెళ్లను మోసం చేసే ప్రయత్నం చేశాడు. తనతోపాటు రావాలని వారిని పురికొల్పి ఇంటి నుంచి బయల్దేరేలా చేశాడు. కానీ, ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారిని పట్టుకున్నారు.
న్యూఢిల్లీ: ఓ ముస్లిం వ్యక్తి హిందువుగా నమ్మించి ఇద్దరు అక్కాచెల్లెళ్లను ట్రాప్ చేయాలని స్కెచ్ వేశాడు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మైనర్లు. వారిని ఇంటిలో నుంచి బయటకు తనతో వచ్చేయాలని చెప్పాడు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఆ మోసగాడిని కలుసుకోవడానికి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
హిందువుగా నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు గురువారం తెలిపారు.
ముజఫర్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్లను(ఒకరు 16 సంవత్సరాలు, మరొకరు 14 సంవత్సరాలు) పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో పరిచయం అయ్యాడు. ఆ ఇద్దరికి తాను గుడ్డు అనే పేరుతో పరిచయం అయ్యాడు. వారితో సుమారు రెండేళ్లుగా వీడియో కాల్‌లో చాట్ చేస్తున్నాడు. తనతో రావాలని ఆ ఇద్దరికీ సూచించాడు. ఆరకోట్ ఏరియాకు రావాలని చెప్పాడు.
ఈ విషయం ఆ బాలికల తల్లిదండ్రులకు తెలిసింది. ఆ తల్లిదండ్రులు బాలికల వెంటే వెళ్లారని, మోల్డీ ఏరియాలో వారిని పట్టుకున్నట్టు మోరీ ఎస్‌హెచ్‌వో మోహన్ సింగ్ కతైట్ తెలిపారు.
గుడ్డు అని పరిచయం చేసుకున్న ఆ ముస్లిం వ్యక్తి పేరు నవాబ్ అని తేలిందని వివరించారు.
Also Read: వయానాడ్‌లో ఉప ఎన్నికకు ఏర్పాట్లు! మాక్ పోలింగ్‌తో అన్ని కళ్లు అటువైపే.. బరిలోకి ప్రియాంక గాంధీ?
ఆ అక్కాచెల్లెళ్లది నేపాల్. కానీ,ఆరాకోట్ ఏరియాలోని కిరాను గ్రామంలో ఉంటున్నారని కతైట్ వివరించారు.
నవాబ్ పై తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. తమ బిడ్డలకు ముంబయిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నవాబ్ వంచించాడని ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపింది. అంతేకాదు, తన కూతుళ్లను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టూ వివరించింది.