Asianet News TeluguAsianet News Telugu

Agnipath : అగ్నిపథ్ పథకానికి ముస్లిం మేధావుల వర్గం మద్దతు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి ముస్లిం మేధావుల వర్గం మద్దతు ప్రకటించింది. సాయుధ బలగాల్లో చేరి దేశానికి సేవల చేయాలని ముస్లి యువతను కోరింది. ఈ పథకంపై అపోహలు తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపింది. 

Muslim intellectuals support Agneepath scheem
Author
New Delhi, First Published Jun 24, 2022, 12:55 PM IST

దేశ వ్యాప్తంగా నిరసనలు, హింసాత్మక ఘటనలకు కారణమైన అగ్నిపథ్ పథకానికి ముస్లిం మేధావుల వర్గం మద్దతు తెలిపింది. అగ్నిపథ్ పథకంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. శుక్ర‌వారం ప్రార్థనలకు వచ్చే యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాల‌ని, సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేసేలా ప్రోత్స‌హించాల‌ని మతపెద్దలకు లక్నోలోని ముస్లిం మేధావుల బృందం కోరింది. 

శుక్ర‌వారం నుంచి త‌మ సంఘం ఆధ్వ‌ర్యంలో అగ్నిప‌థ్ పై ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌ని అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషనల్స్ (AMP) సంఘంలోని మేధావుల బృందం ప్ర‌క‌టించింది. ‘‘ మేము ఇత‌ర ప‌థ‌కాల మాదిరిగానే అగ్నిపథ్ కు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నాము. మా సందేశం వివిధ నగరాల్లోని ప్రముఖ మతాధికారులు, మసీదుల ఇమామ్‌ల ద్వారా అర్హులైన ముస్లిం యువకులకు పంపింస్తాం. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల స‌మ‌యంలో ఈ విష‌యంలో ప్ర‌త్యేకంగా  విజ్ఞ‌ప్తి చేస్తాం’’ అని ఏఎంపీ పేర్కొంది. 

రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు: మోడీ సహా పలువురు మంత్రులు హాజరు

ఆ సంఘం నాయ‌కుడు షాహిద్ కమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘ అగ్నిపథ్ పై ప్రచారం కోసం మేము సోషల్ మీడియా సహాయం కూడా తీసుకుంటాం. ఆర్మీలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న ముస్లిం యువతకు మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తున్నాము ’’ అని పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. అయితే ఇందులో నాలుగేళ్ల పాటు ప‌ని చేసిన అగ్నివీర్ ల‌కు పెన్ష‌న్ సౌక‌ర్యం ఉండ‌దు. 

తండ్రి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. రూ.39 లక్షలు ఖాళీ చేసిన కొడుకు...

ఈ ప‌థ‌కంలో లోపాలు ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు ప‌లు ప్రాంతాల్లో ఆందోళ‌నలు జ‌రిగాయి. ఇవి తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆర్మీ ఉద్యోగార్థులు రోడ్ల‌పైకి వ‌చ్చి వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. టైర్ల‌కు నిప్పు పెట్టారు. రైలు ప‌ట్టాల‌పై కూర్చొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అలాగే రైలు బోగీల‌కు కూడా మంట పెట్టారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని నిబంధ‌న‌లు స‌డ‌లించింది. కేంద్ర బ‌లగాల్లో అగ్నీవ‌ర్ ల‌కు 10 శాతం కోటా క‌ల్పిస్తామ‌ని చెప్పింది. అలాగే మొద‌టి రిక్రూట్ మెంట్ స‌మ‌యంలో రెండేళ్లు వ‌యో ప‌రిమితి క‌ల్పిస్తామ‌ని తెలిపారు. 

అయిన‌ప్ప‌టికీ ఈ ప‌థ‌కంపై అభ్య‌ర్థుల్లో అపోహ‌లు నెల‌కొన్నాయి. వీటిని తొల‌గించ‌డంలో భాగంగానే నేడు ముస్లిం మేధావుల వ‌ర్గం చొర‌వ చూపింది. అయితే అగ్నిప‌థ్ లో చేరితే సామాజిక బహిష్క‌ర‌ణ చేస్తామ‌ని హ‌ర్యానాలోని ఖాప్, ఇత‌ర వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. ఈ మేర‌కు గురువారం స‌మావేశం నిర్వ‌హించి త‌మ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాయి. ఈ స‌మావేశానికి రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌ల నుంచి పలు ఖాప్‌లు, ఇతర కమ్యూనిటీ గ్రూపులు, అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్ లు పాల్గొన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios