పసికందును కాపాడటానికి ఈ ముస్లిం యువకుడు ఏం చేశాడంటే...

muslim boy saved a child life at  uttar pradesh
Highlights

సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

కులాలు,  మతాలు, కట్టుబాట్ల పేరుతో మనిషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నవారికి ఈ ముస్లీం యువకుడు చక్కటి గుణపాఠం చెప్పాడు. ఏ మతమైనా ప్రణఆలను కాపాడమనే చెబుతుందని నిరూపించాడు. రంజాన్ మాసం లో నిష్టగా ఉపవాసం చేపట్టే ఇతడు ఓ రెండేళ్ల చిన్నారి కోసం తన మతాచారాన్ని పక్కనపెట్టాడు. దీంతో అతడి సేవాగుణం పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 

ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ కు చెందిన రమేశ్‌ సింగ్‌ సశస్త్ర సీమా బల్‌ లో జవాన్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇతడి భార్య ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఈ పసిగుడ్డుకు అనారోగ్యం కారణంగా వెంటనే రక్తం ఎక్కించాల్సి వచ్చింది. పాపది రేర్ గా దొరికే ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్. ఆస్పత్రిలో, బ్లడ్ బ్యాంక్ లో ఈ రక్తం అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు దాతల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ను చూసిన అష్కప్ అనే ముస్లీం యువకుడు పాపకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాడు.

అయితే అతడు పాపకు రక్తం ఇవ్వడానికి రంజాన్ మాసంలో ముస్లింలు అతి నియమ నిష్టలతో చేపట్టే ఉపవాసాన్ని పక్కనపెట్టాడు. బిడ్డ ప్రాణాలను కాపాడటమే ముఖ్యంగా భావించి ఆస్పత్రికి వెళ్లి పండ్లు తిని రక్తదానం చేశాడు.  దేశాన్ని కాపాడే జవాన్ కూతురిని తాను కాపాడటం ఆనందంగా ఉందని అన్నాడు. అల్లా తనను ఈ బిడ్డ ప్రాణాలను కాపాడటానికి ఎంచుకున్నారని అష్కప్ తెలిపాడు.

loader