Asianet News TeluguAsianet News Telugu

1994లో ఐదుగురి హత్య.. 28 ఏళ్ల తరువాత ముంబై ఎయిర్ పోర్టులో చిక్కిన నిందితుడు

ఐదుగురి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు ఘటన జరిగిన 28 ఏళ్ల తరువాత అరెస్టు చేశారు. అతడు 1994 సంవత్సరంలో ఓ మహిళను, నలుగురు చిన్నారులను మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Murder of five people in 1994. Accused caught in Mumbai airport after 28 years
Author
First Published Dec 31, 2022, 10:20 AM IST

28 ఏళ్ల కిందట నలుగురు చిన్నారులను, ఓ మహిళను హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. కతార్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు గురువారం చేరుకున్న నిందితుడిని స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అప్పగించారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై కాశీమీరాలోని భర్వాద్ చాల్‌లోని పెంకరపాడలో 1994 సంవత్సరంలో జాగ్రణీ దేవి, రాజనారాయణ్ ప్రజాపతి దంపతులు నివసించేవారు. వారికి నలుగురు పిల్లలు ఉండేవారు. వారిందరి వయస్సు ఐదు సంవత్సరాలోపే ఉంటుంది. 1994 నవంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు స్థానికంగా ఉండే ముగ్గురు నిందితులు రాజ్‌కుమార్ చౌహాన్ (19), అనిల్ సరోజ్ (25), సునీల్ పరారీ (21)లు వారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో రాజనారాయణ్ పని కోసం బయటకు వెళ్లారు.

షాకింగ్.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక కుళ్లిన మహిళ మృతదేహం..

ఇంట్లో మహిళ భర్త లేకపోవడంతో ఆమెను, నలుగురు పిల్లలను దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పని నుంచి రాజనారాయణ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో చనిపోయి ఉన్న పిల్లలు, భార్యను చూసి షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై అతడు పోలీసులకు సమాచారం అందించాడు.

ఈ హత్యలకు కొన్ని వారాల ముందు జాగరాణి దేవిపై ముగ్గురు నిందితులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో రాజనారాయణ్ వారితో బహిరంగంగా వారితో గొడవకు దిగాడు. దీంతో వీరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటన తరువాత తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితులు రాజనారాయణను హెచ్చరించాడు. అయితే ఈ ఘటనపై కాశీమీరా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

ఎస్‌యూవీ-బస్సు ఢీ.. ఘోర ప్ర‌మాదంలో తొమ్మిది మంది స్పాట్ డెడ్

కానీ అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. అయితే రాజనారాయణ 2006లో కారు ప్రమాదంలో మరణించారు. ఈ కేసులో అప్పటి నుంచి పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల జాడ తెలియకపోవడంతో కేసు మరుగున పడిపోయింది. అయితే గతేడాది ఈ కేసును మళ్లీ విచారించడం ప్రారంభించినట్టు డీసీపీ అవినాష్ అంబురే తెలిపారు. దీని కోసం 2021 జూన్‌లో కాషిమీరాలోని క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ బృందం యూపీలోని వారణాసికి వెళ్లింది.

వారణాసి పోలీసుల సహకారంతో సిట్ సభ్యులు సుమారు 20 రోజులు నగరంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ ఘటన లో నిందితుడైన చౌహాన్ అలియాస్ కల్యా అలియాస్ సాహెబ్ ఆచూకీ తెలిసింది. అతడు 2020 నుంచి ఖతార్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. పాస్ పోర్టు వివరాలు కూడా దొరికాయి. ఆ వివరాల ఆధారంగా దేశంలోని ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్‌లలో పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.

నీటితో నిండి ఉన్న క్వారీలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

ఈ క్రమంలో రాజ్‌కుమార్ చౌహాన్ గురువారం విమానం ద్వారా ముంబై విమానాశ్రయానికి వచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిందితుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకున్న తరువాత పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అతడి వయస్సు 47 సంవత్సరాలకు చేరింది. మిగితా ఇద్దరు నిందితుల ఆచూకీ కోసం చౌహాన్‌ను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios