ముస్లిం గాయకుడై ఉండి భజన కీర్తన పాడాడని ఓ సింగర్ పై పగ పెంచుకున్న కొంతమంది దుండగులు అతని సోదరుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. 

ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో భజన కీర్తన పాడినందుకు వివాదంలో చిక్కుకున్న ముస్లిం గాయకుడి సోదరుడు (17)ని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. బాధితుడు ఖుర్షీద్.. గాయకుడు ఫర్మానీ నాజ్ కి వరుసకు తమ్ముడవుతాడని పోలీసులు తెలిపారు. రతన్‌పురిలోని ముహమ్మద్‌పూర్ మాఫీ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) అతుల్ శ్రీవాస్తవ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు. శివుడిని స్తుతిస్తూ భక్తిగీతమైన నాజ్ గత సంవత్సరం 'హర్ హర్ శంభు' అంటూ గానం చేశారు. దీన్ని దేవ్‌బంద్ కు చెందిన ఓ మతగురువుతో "అన్-ఇస్లామిక్", "హరామ్" అని మతవిశ్వాసాలకు విరుద్ధమని ఫర్మానా జారీ చేశారు. 

అసోంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల పై రేప్.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న బాధితులు

దీనికి జవాబుగా కళాకారులకు మతం లేదని, తాను తప్పు చేయలేదని ముజఫర్‌నగర్‌కు చెందిన నాజ్‌ తనను తాను సమర్థించుకున్నారు. సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12లో కూడా నాజ్ పాల్గొన్నారు. నాజ్ యూట్యూబ్ ఛానెల్‌కు 4.5 మిలియన్ల కంటే ఎక్కువ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 

ఇదిలా ఉండగా నాజ్ సోదరుడు ఖుర్షీద్ హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అద్నాన్, వాజిద్, జుబేర్ లుగా గుర్తించారు. వారినుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కూడా నాజ్ కు బంధువులే. సోదరులవుతారు. వీరిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.