వ్యవసాయ చట్టాలు: ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కాన్వాయ్.. ఇద్దరి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా.. పలువురు గాయపడ్డారు.

Two dead after Union ministers convoy over protesting farmers in UPs Lakhimpur Kheri


ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.  

లకింపూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారని సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు మూడు వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు రైతులపై కాన్వాయ్‌ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయిత్‌ ఖండించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios