Asianet News TeluguAsianet News Telugu

పానీపూరిపై నిషేధం విధించిన అధికారులు

అపరిశుభ్రమైన పదార్థాలతో తయారుచేస్తున్నారన్న కారణంతో పానీపూరి అమ్మకాలపై ఓ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. యువతీ యువకులతో పాటు చిన్నారులు ఎంతో ఇష్టంగా తినే వీటిపై నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Municipal corporation bans panipuris in vadodara

అపరిశుభ్రమైన పదార్థాలతో తయారుచేస్తున్నారన్న కారణంతో పానీపూరి అమ్మకాలపై ఓ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. యువతీ యువకులతో పాటు చిన్నారులు ఎంతో ఇష్టంగా తినే వీటిపై నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని వడోదర మున్సిపాలిటి అధికారులు వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అనారోగ్యం పాలవకుండా ఉండడానికి కఠిన నిర్ణయాలు తీసుకుటుంన్నారు.  అపరిశుభ్ర పదార్థాలతో, ప్రాంతాల్లో తయారయ్యే తినుబండారాలపై నిషేదం విధిస్తున్నారు. ఇందులో భాగంగా పానీపూరిపై కూడా నిషేదాన్ని విధిస్తూ మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది. 

మున్సిపాలిటీ వైద్య విభాగం అధికారులు ప్రత్యేకంగా పానీపూరీని తయారుచేసే స్థావరాలపై దాడులు చేశారు. అక్కడున్న కలుషిత వాతావరణాన్ని, సరుకులను చూసి నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని ద్వంసం చేశారు. పట్టణ పరిధిలో వీటిని విక్రయించే దుకాణాలు, తోపుడుబండ్లల్లో తనిఖీలు నిర్వహించి మూసేయించారు. 

వర్షాకాలంలో కలుషిత పదార్థాలు తినడం వల్ల టైపాయిడ్, కామెర్ల వ్యాధులతో పాటు పెడ్ పాయిజన్, వాంతులు, విరేచనాలు వంటివాటి బారిన పడే అవకాశం ఉంది. అందువల్లే ఇలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.

 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios