ఇదెక్కడి మోసంరా బాబు .! అమ్మాయి పిలిచిందని వెళ్ళారో అంతే సంగతి.!!

మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కొట్టేసే సైబర్ మోసాలను చూసాం.  కానీ మనచేతులతోనే డబ్బిచ్చి మోసపోవడం గురించి విన్నారా... అలాంటి హైటెక్ మోసమే తాజాగా వెలుగుచూసింది. 

Mumbai Shocking Pub Scam: Dating Apps Used to Empty Innocents  Wallets AKP

మనీ, మగువ... ఈ రెండూ ఎంతటి బలవంతులనైనా బలహీనుడిగా మారుస్తుంది. ఇలాంటి జనాల బలహీనతలే మోసగాళ్ళకు పెట్టుబడి... వీక్ నెస్ తెలుసుకుని ముగ్గులోకి లాగిలే ఎంతటివారైనా బోల్తా పడాల్సిందే. మన ఆశను ఆసరాగా చేసుకునే కేటుగాళ్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలకాలంలో డబ్బులు ఆశచూపి, అమ్మాయిలను ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పెరిగిపోయాయి. ఇలాంటి హైటెక్ మోసమే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగుచూసింది.      

ఫోన్ చేసి బ్యాంకు వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడటం చూసుంటారు... వివిధ పద్దతుల్లో వివరాలు సేకరించి డబ్బులు ఊడ్చేయడం గురించి వినుంటారు. కానీ మన చేతులతోనే కేటుగాళ్లకు డబ్బులిచ్చి మోసపోవడం గురించి విన్నారా..! ఇలాంటి ఘరానా మోసాలే ఇటీవల మెట్రో నగరాల్లో ఎక్కువయిపోయాయి. తాజాగా ముంబైలో  అమ్మాయిలను ఎరగా వేసి కొన్ని పబ్ లు సాగిస్తున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.  

ముంబైలోని ఓ పబ్ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని అమాయకులను ఎలా మోసం చేస్తుందో ప్రముఖ జర్నలిస్ట్ దీపికా నారాయన్ భరద్వాజ్ బైటపెట్టారు. టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్ ల ద్వారా అమ్మాయిల పరిచయాలు అబ్బాయిల జేబులను ఎలా ఖాళీ చేస్తున్నాయో ఎక్స్ వేదికన వివరించారామె. ముంబైలోని ఓ పబ్ మోసాన్ని ఆధారాలతో సహా బైటపెట్టారు.    

భరద్వాజ్ బైటపెట్టిన వివరాల ప్రకారం ...  పాపులర్ డేటింగ్ యాప్ లతో స్కామ్ ప్రారంభమవుతుంది.  ఈ యాప్ లలో అమ్మాయిలతో పరిచయం కోరుకునే అబ్బాయిలే టార్గెట్. ఇలా పరిచయం కాగానే అలా కలుద్దామని అమ్మాయిల నుండి ప్రపోజల్ వస్తుంది. బయట ఎక్కడో కలవడం ఎందుకు పబ్ కి వెళదామంటారు. అమ్మాయి పిలిచింది కదా అని వెళ్లారో మీ పని అయిపోయినట్లే.  పబ్ లో వేలల్లో బిల్ చేసి మీ జేబులు ఖాళీ చేస్తారు. ఈ చీటింగ్ లో కీలకపాత్ర ఎవరిదంటే పబ్ లదే.  

ఇలా అమ్మాయిలను ఎరగా వేసి ముంబైలోని గాడ్ ఫాదర్ పబ్ ఎలా మోసాలకు పాల్పడుతుందో భరద్వాజ్ బైటపెట్టారు. ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో అమాయకులు ఈ హైటెక్ మోసానికి గురయినట్లు ఆమె వెల్లడించారు. డేటింగ్ యాప్ లలో పరిచయమయ్యే అమ్మాయిలు ఈ పబ్ కే అబ్బాయిలను తీసుకువస్తారు... వారితో వేలల్లో బిల్ చేయించి పరారవుతారు. ఇలా  20 వేల నుండి లక్ష రూపాయలవరకు బిల్ చేయిస్తారని తెలిపారు. ఇలా అబ్బాయిలను వలలో వేసుకుని తమ పబ్ కు తీసుకువచ్చేందుకే ప్రత్యేకంగా అమ్మాయిలను నియమించుకుంటున్నారు. వీరికి మోసం చేసి కట్టించిన బిల్ లో వాటా ఇస్తారు. 

 

 అయితే ఒక్క ముంబైలోని కాదు హైదరాబాద్, బెంగళూరు, డిల్లీ వంటి నగరాల్లోనూ ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నాయి. తమ వ్యాపారం కోసం అమాయకులను బలిచేస్తున్నాయి కొన్ని పబ్ లు. కాబట్టి డేటింగ్ యాప్ లలో పరిచయమయ్యే అమ్మాయిలతో కాస్త జాగ్రత్త. మీరు కాస్త ఏమరపాటుగా వున్నా మీ జేబులు ఖాళీ చేయడమే కాదు బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios