Asianet News TeluguAsianet News Telugu

ముంబైని ముంచెతుత్తున వర్షాలు: మరో ఐదు రోజులు వానలు

మహారాష్ట్ర రాజధాని ముంబైని వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.  బుధవారం నాడు  మహారాష్ట్రను తాకినట్టుగా ఐఎండీ తెలిపింది.  దీంతో మంగళవారం నాడు రాత్రి నుండి వర్షాలు కురుస్తున్నాయి. 

Mumbai receives heavy rain as monsoon advances over Maharashtra lns
Author
New Delhi, First Published Jun 9, 2021, 11:40 AM IST

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.  బుధవారం నాడు  మహారాష్ట్రను తాకినట్టుగా ఐఎండీ తెలిపింది.  దీంతో మంగళవారం నాడు రాత్రి నుండి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో  ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైలోని కొలాబాలో 65.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. శాంతాక్రూజ్ లో 50. మి.మీ వర్షపాతం కురిసింది.  రాయ్‌ఘడ్, రాణి, పాల్ఘర్ , నాసిక్ తదితర జిల్లాల్లో వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. 

ఈ నెల 9 నుండి 13 వరకు ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇటీవలనే  తుఫాన్ కారణంగా ముంబైతో పాటుే మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడ రుతుపవనాలు రెండు రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios