ముంబై భారీ వర్షాలు.. బస్సు చక్రాల కింద నలిగిన మహిళ

Mumbai Rains : Woman On Bike Dies After Hitting Pothole
Highlights

ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేయగా.. ఎందరినో నిరాశ్రయులని.. మరికొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ అడుగుల లోతులో మునిగిపోయాయి

ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేయగా.. ఎందరినో నిరాశ్రయులని.. మరికొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ అడుగుల లోతులో మునిగిపోయాయి. కనీసం ఎదురు ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదే ఓ విషాదానికి కారణమైంది.. మనిషా బోయిర్ అనే మహిళ కల్యాణ్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది.

ఆదివారం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు తన సోదరుడి బైక్ మీద ఇంటికి బయలుదేరింది. అప్పటికే భారీ వర్షం కురుస్తుండటంతో సోదరుడిపై వర్షం పడకుండా గొడుగు పట్టుకుని వెనకాల కూర్చొంది. శివాజీ చౌక్ వద్దకు చేరుకోగానే.. రోడ్డుపై నీటితో నిండిన గుంతను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పి ఇద్దరూ రోడ్డు మీద పడ్డారు.

ఆ సమయంలో అటువైపు వేగంగా వస్తున్న బస్సు కింద పడటంతో.. బస్సు మనీషా మీదుగా వెళ్లిపోయింది.. వెంటనే పరుగు పరుగున స్థానికులు వచ్చినప్పటికీ అప్పటికే ఆమె మరణించింది. ఈ ప్రమాదం మొత్తం స్థానిక దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డవ్వడంతో.. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

loader