26/11 ఘటనలో కసబ్‌ను గుర్తు పట్టిన హీరో: ప్రస్తుతం ఫుట్‌పాత్‌పై దయనీయ స్ధితిలో
సబ్‌ను గుర్తుపట్టి పోలీసులకు సహకరించిన సాక్షి హరిశ్చంద్ర శ్రీవార్థంకర్ ప్రస్తుతం దయనీయ పరిస్ధితుల్లో ఉన్నారు. 60 ఏళ్ల వయసులో ముంబైలోని ఫుట్‌పాత్‌పై అచేతనంగా పడివున్న ఆయనను డీన్ డిసౌజా అనే షాపు ఓనర్ చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు
26/11 ముంబైపై దాడుల ఘటనను తలచుకుంటే భారతీయుల వెన్నులో వణుకు పుడుతుంది. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి దాదాపు 166 మంది చనిపోయారు.
ఈ నరమేధానికి కారణమైన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుబడింది కసబ్ ఒక్కడే. ఈ ఘటనలో కసబ్‌ను గుర్తుపట్టి పోలీసులకు సహకరించిన సాక్షి హరిశ్చంద్ర శ్రీవార్థంకర్ ప్రస్తుతం దయనీయ పరిస్ధితుల్లో ఉన్నారు.
Also Read:దారుణం:మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు ముందే భార్యను చంపాడు
60 ఏళ్ల వయసులో ముంబైలోని ఫుట్‌పాత్‌పై అచేతనంగా పడివున్న ఆయనను డీన్ డిసౌజా అనే షాపు ఓనర్ చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఈ విషయంపై ఎన్జీవో సంస్థను నడుపుతున్న గైక్వాడ్ మాట్లాడుతూ... శ్రీవార్ధంకర్ తాము ఇచ్చిన ఆహారం తినడం లేదని.. ఆయనకు స్నానం చేయించి జుట్టు కత్తిరించాం.
తనలో తానే మాట్లాడుకుంటున్నారు. ఆయన మాటలను బట్టి హరిశ్చంద్ర, బీఎంసీ, మహాలక్ష్మీ అనే పదాల ఆధారంగా బీఎంసీ కాలనీకి వెళ్లి ఆరా తీసినట్లు గైక్వాడ్ చెప్పారు. శ్రీవార్థంకర్ సోదరుడు ఆయనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
Also Read:ఇండియాను వణికిస్తున్న కరోనా: 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు,మరణాలు
ముంబై దాడుల ఘటనలో కీలక సాక్షిగా ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీవార్థంకర్ కొడుకుకు ప్రత్యేక పాస్ జారీ చేసి ఆయనను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు.
ఓ కరడుగట్టిన ఉగ్రవాదికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన హీరో శ్రీవార్థంకర్‌కు సాయం చేసేందుకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని.. తలపై గాయం కూడా ఉంది. వార్ధంకర్‌కు చికిత్స చేసేందుకు సహకరించాలని గైక్వాడ్ విజ్ఙప్తి చేశారు. కాగా నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణేలోని ఎరవాడ కేంద్ర కారాగారంలో ఉరి తీసిన సంగతి తెలిసిందే.