Asianet News TeluguAsianet News Telugu

పాదాచారుడి పై నుంచి దూసుకెళ్లిన బస్.. ఆశ్చర్యంగా వాహనం వెనుక నుంచి సేఫ్‌గా బయటకు.. (వీడియో)

ముంబయిలో ఓ రద్దీ రోడ్డుపై పాదాచారుడి పైనుంచి ఓ బస్సు దూసుకెళ్లింది. బస్సు కింద వ్యక్తి పడిపోయాడని గ్రహించిన డ్రైవర్ దాదాపు ముందుకెళ్లిన తర్వాత ఆపేశాడు. అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ వ్యక్తి బస్సు కింది నుంచి సేఫ్‌గా బయటకు వచ్చాడు.
 

mumbai man run over by bus, escapes unhurt viral video
Author
First Published Dec 15, 2022, 5:26 PM IST

ముంబయి: అది ముంబయిలోని పొవాయ్ ఏరియా. రద్దీగా ఉన్న రోడ్డు. వాహనాల మందకొడిగా కదులుతున్నాయి. పాదాచారులూ ఆ రద్దీ రోడ్డుపై కనిపించారు. రోడ్డు దాటడం సాహసంగా ఉన్నది. అక్కడ ఓ వృద్ధుడు రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. రోడ్డు మీదికి వచ్చాడు. కానీ, ఆ బస్సు డ్రైవర్‌కు అతను కనిపించలేదు. దీంతో ఎవరూ లేరేమో అని అనుకుని బస్సును ముందుకు పోనిచ్చాడు. ఆ వ్యక్తిని బస్సు మెల్లగా ఢీకొట్టింది. కిందపడిపోయిన ఆ వ్యక్తి పై నుంచే బస్సు దూసుకెళ్లిపోయింది.

రద్దీగా ఉన్న ఆ రోడ్డు పై బస్సు మెల్లగా మూవ్ అవుతున్నది. ఆ సమయంలోనే ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ చేయడానికి వచ్చాడు. మెల్లిగా మూవ్ అవుతున్న సమయంలో ఆ వ్యక్తి క్రాస్ చేయడం.. క్రాస్ చేస్తున్న వ్యక్తి బస్సులోని డ్రైవర్‌కు కనిపించలేదు. దీంతో అదే స్పీడ్‌ను ఇంకొంచెం పెంచాడు బస్ డ్రైవర్. దీంతో రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. అది కూడా డ్రైవర్‌కు కనిపించలేదు. బస్సును అలాగే ముందుకు పోనివ్వడంతో వ్యక్తి పై నుంచి వెళ్లిపోయింది. ఆ వ్యక్తి కూడా కిందపడిపోయాడు. అతడి పై నుంచే బస్సు వెళ్లిపోయింది.

Also Read: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30మంది నర్సింగ్ విద్యార్థులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం...

ఆ ఘటనను చూసిన పాదాచారులు, కారు డ్రైవర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అరుపులు వేశారు. దీంతో వారిని చూసి బస్సు డ్రైవర్ ఆపాడు. ఒక వ్యక్తి బస్సు కింద పడిపోయాడని తెలియగానే వాహనాన్ని ఆపేసి వెనక్కి చూశాడు. ఆ వ్యక్తి జీవించి ఉన్నాడా? లేదా? అని చూశాడు. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ బస్సు వెనుక వైపు కింది నుంచి పైకి లేచి ఆగ్రహంగా ముందుకు వస్తూ కనిపించాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఈ సీసీటీవీ కెమెరా వీడియోను పోస్టు చేసింది.  ఈ వీడియోను ఇతర నెటిజన్లూ షేర్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios