ముంబైలో ఓ ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలికి ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసి, ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదో ప్రియుడు. దాంతో వదిలేస్తే పోయేది. కానీ అలా ఊరుకోలేదు. ఆమెకు కెటామైన్ ఇంజక్షన్ ఇచ్చి దారుణంగా చంపేశాడు. 

నవీ ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ప్రియుడు ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు కనిపెట్టారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

దారుణం : యువతితో స్నేహం... యువకులపై దాడి, అరగుండు, మెడలో చెప్పులదండలు.. !!...

పన్వెల్ లోని ఆసుపత్రిలో పనిచేస్తున్న చంద్రకాంత్ గైకర్ అే వ్యక్తికి తన సోదరితో ఎఫైర్ ఉందని మృతురాలి సోదరుడు పోలీసులకు చెప్పాడు. దీంతో చంద్రకాంత్ ను పట్టుకుని విచారిస్తే నేరం అంగీకరించాడు. 

పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే భయంతో తాను అనారోగ్యానికి గురైన ప్రియురాలికి ఇంజక్షన్ ఇచ్చి చంపానని చంద్రకాంత్ అంగీకరించాడు. ప్రియురాలి అనారోగ్యం తగ్గించేందుకు ఇంజక్షన్ అని చెప్పి, కెటమైన్ ఇంజక్షన్ చేశాడని తేలింది. దీంతో నిందితుడు చంద్రకాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.