మహారాష్ట్రలో నోట్ల మార్పిడి స్కామ్‌లో ఓ వ్యక్తి రూ. 1 కోటి నష్టపోయాడు. రూ. 2000 నోట్లు తమకు ఇస్తే వాటిని మార్చి.. 10 శాతం కమీషన్ కూడా ఇస్తామని నమ్మించారు. తీరా రూ. 1 కోటి బ్యాగులో సర్దుకుని వచ్చాక పోలీసుల వేషంలో వచ్చి పట్టుకుని పారిపోయారు.
ముంబయి: మహారాష్ట్రలో ఓ కొందరు దుండగులు కలిసి ఓ స్కామ్ చేశారు. పకడ్బందీగా ఒక వ్యక్తిని మోసం చేశారు. రూ. 2000 నోట్లు మార్పిడి చేసి ఇస్తామని, అందుకు కమీషన్ కూడా ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని నమ్మించారు. రూ. 1 కోటి పట్టుకుని ఉడాయించారు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది.
ఇటీవలే ఆర్బీఐ రూ. 2000 నోట్లను మార్చుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ వరకు అవకాశం ఇచ్చింది. రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని లేదా, అకౌంట్‌లో డిపాజిట్ కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోట్లు అధికంగా ఉన్నవారు వెంటనే ఆ పనికి పూనుకున్నారు. ఈ నోట్ల మార్పిడినే ఆసరాగా తీసుకుని ఏకంగా రూ. 1 కోటి మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది.
31 ఏళ్ల హసన్ ఖురేషి, 33 ఏళ్ల ఉబెదుర్ రెహ్మాన్‌లు కలిసి ఒక పథకం వేశారు. రూ.2000 నోట్లు మార్పిడి చేసి ఇస్తామని, అంతేకాదు, రూ. 2000 నోట్లు తమకు ఇచ్చి మార్పిడి చేసుకుంటే పది శాతం కమీషన్ కూడా అందిస్తామని ఓ వ్యక్తికి చెప్పారు.
Also Read: Note Ban: ఏడేళ్లలోనే రూ. 2000 నోట్లను ఆర్బీఐ ఎందుకు రద్దు చేస్తున్నది? వివరణ ఏం ఇచ్చింది?
వీరి మాటలు నమ్మి ఓ వ్యక్తి రూ. 1 కోటి నగదు అన్నీ రూ. 2000 నోట్లతో ఉన్నవే బ్యాగులో పెట్టుకుని వచ్చాడు. వారు చెప్పిన ప్లేస్‌కు ఆ డబ్బులు తీసుకుని వచ్చాడు. కాగా, ఓ నలుగురు వ్యక్తులు పోలీసుల వేషంలో అక్కడికి వచ్చారు. ఆ డబ్బులు పట్టుకుని ఉడాయించారు. వెంటనే డబ్బులు తీసుకెళ్లిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబయి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితు లను అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కానీ, మిగిలిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
