రివర్స్: యువతి వేధింపులు భరించలేక ప్రియుడి ఆత్మహత్య

Mumbai: Man kills self, makes video blaming girl
Highlights

ప్రేమ పేరిట ఓ యువతి తనను వేధిస్తోందని ఆరోపిస్తూ  ఓ యువకుడు  రైలు కింద  పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకొంది.  


ముంబై:ప్రేమ పేరిట ఓ యువతి తనను వేధిస్తోందని ఆరోపిస్తూ  ఓ యువకుడు  రైలు కింద  పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకొంది.  అయితే  ప్రేమ పేరుతో  అమ్మాయిలను వేధించడం సాధారణం. కానీ,  ప్రేమించాలంటూ అమ్మాయి వేధింపులకు గురి చేస్తోందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం  సంచలనం సృష్టిస్తోంది.

మహారాష్ట్రలోని ముంబైలోని కళ్యాణ్‌నగర్ ప్రాంతానికి చెందిన రాజేష్ భండారీ రైల్వేలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను  ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే ప్రేమ పేరుతో ఆ అమ్మాయి తనను వేధింపులకు గురి చేస్తోందని  రాజేష్ ఆరోపిస్తున్నాడు. 

ఈ విషయమై ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్ భండారీ  ముంబైలోని విఠల్‌వాడీ ప్రాంతంలో  రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి మొబైల్‌ ఫోన్‌లో ఉన్న వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువతి కారణమని రాజేష్  ఆరోపించారు. 

తన కొడుకును వలలో వేసుకొన్న అమ్మాయి డబ్బుకోసం నిత్యం వేధింపులకు గురిచేసేదని రాజేష్ తల్లి ఆరోపించింది.  రాజేష్ మృతదేహన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader