ఓ వ్యక్తి సొంత సోదరి కూతురిపై కన్నేశాడు. మైనర్ అయిన మేనకోడలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరకు బాలికను గర్భవతిని చేశాడు. బాలిక గానీ, ఆమె తల్లి కానీ అతనిపై కోర్టుకు వెళ్లకపోయినా.. న్యాయస్థానం మాత్రం నిందితుడికి 12ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ  సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది.

Also Read మహిళా టీచర్ ని తాళ్లతో కట్టి.. నడిరోడ్డుపై లాక్కెళ్లి....వీడియో వైరల్.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయి నగరానికి చెందిన 13ఏళ్ల మైనర్ బాలికపై స్వయానా మేనమామ అయిన 27ఏళ్ల కుర్రాడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తొలుత బాలిక, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే... కొద్ది రోజులకే ఆ కేసును వెనక్కి తీసుకున్నారు.

అయితే... బాలిక తల్లి కేసు వాపసు తీసుకున్నా కూడా పోలీసులు, బాలికకు చికిత్స అందించిన వైద్యులు మాత్రం వదలలేదు. వైద్యులు, పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను పరిశలించిన ప్రత్యేక కోర్టు నిందితుడైన మేనమామపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బాధితురాలితోపాటేుు ఆమె తల్లి వ్యతిరేకించినా కూడా న్యాయస్థానం అతనికి 12 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించారు.

దోషి బాధితురాలి కుటుంబంతో రెండున్నర నెలలు కలిసి ఉన్నాడు. ఆ సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. దీంతో దోషి అయిన మేనమామకు 12 ఏళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ జడ్జి ఏడీ డియో తీర్పు చెప్పారు.