నడిరోడ్డుపై ఓ మహిళా ఉపాధ్యాయురాలి పట్ల కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. నడిరోడ్డుపై తాడుతో కట్టి పశువుకన్నా హీనంగా లాక్కొని వెళ్లారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడతియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.... పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దీనజ్ పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ భూమిని తృణమూల్ కాంగ్రెస్  పంచాయతీ లీడర్  అమల్ సర్కార్ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు.  దీంతో... తమ భూమిని తమకు ఇవ్వాలంటూ సదరు భూమికి చెందిన మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేపట్టింది.

Also Read దారుణం:భార్య, పిల్లలను హత్య చేసి ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్..

దీంతో అమల్ సర్కార్... తన మద్దతుదారులతో కలిసి ఆందోళన చేస్తున్న మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఆమె మోకాళ్లను తాళ్లతో కట్టి నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ దారుణాన్ని ఆపేందుకు సదరు మహిళ అక్క ప్రయత్నించగా... ఆమెపై కూడా దాడి చేయడం గమనార్హం. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వీడియో వైరల్ అయ్యింది.

ఆ వీడియో కాస్త తృణముల్ కాంగ్రెస్ అధిష్టానం దాకా వెళ్లింది. దీంతో వెంటనే  అమల్ సర్కార్ ని పార్టీ నుంచి తొలగించారు. అయితే ఇప్పటిరవకు ఈ ఘటనపై ఎలాంటి పోలీస్ ఫిర్యాదు నమోదు కావడం కానీ... ఎలాంటి అరెస్ట్ లు జరగకపోవడం గమనార్హం.

దీనిపై బాధిత మహిళలు మాట్లాడుతూ... రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఇంటి ముందు స్థలం కొంత అవసరమని అధికారులు తమకు చెప్పారని వారు తెలిపారు. తొలుత 12అడుగుల భూమి కావాలని అన్నారని... దానికి తాము అంగీకరించామని చెప్పారు. తీరా పనులు మొదలుపెట్టాక అమర్ సర్కార్, అతని అనుచరలు వచ్చి 24 అడుగుల భూమి కావాలని అడిగారని చెప్పారు. 

దీంతో...దానికి తాము నిరాకరించామని అందుకే తమ పట్ల అంత క్రూరంగా ప్రవర్తించారని వారు వాపోవడం గమనార్హం. వాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు అక్కాచెళ్లెళ్లకు వైద్యం అందించారు. సదరు బాధితురాలు స్థానిక హై స్కూల్ లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది.