Asianet News TeluguAsianet News Telugu

సెక్స్‌లో పాల్గొనలేదని గర్ల్‌ఫ్రెండ్‌ను చితకబాదిన యువకుడు, హత్యాయత్నం కింద అరెస్టు

సెక్స్‌లో పాల్గొనలేదని ఓ యువకుడు ఆమెను చితకబాదాడు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నవాళ్లు ముంబయిలోని కీలక ప్రాంతాలను పర్యటించారు. ఒక చోట ఆమెను సెక్స్‌లో పాల్గొనాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో గొంతు నులిమే ప్రయత్నం చేశాడు.
 

mumbai man beats girl friend for refusing sex, arrested on attempt murder charges kms
Author
First Published Jun 2, 2023, 7:05 PM IST

ముంబయి: ఆ యువకుడు, యువతి ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడే పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఆ టూర్‌లోనే ఓ చోట తనతో సెక్స్‌లో పాల్గొనాలని గర్ల్‌ఫ్రెండ్‌కు ఆ యువకుడు ఓ ప్రపోజల్ పెట్టాడు. ఆమె తిరస్కరించింది. అయినా.. ఆమె మీది మీదికి పోయాడు. ఆమె ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. ఆమెను చితకబాదాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది.

28 ఏళ్ల ఆకాశ్ ముఖర్జీ ముంబయి ఔట్‌స్కర్ట్స్ కళ్యాణ్‌కు చెందిన వ్యక్తి. ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో 28 ఏళ్ల యువతి పని చేస్తున్నది. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం వారిద్దరూ లోకల్ ట్రైన్‌లో కళ్యాణ్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి వారు కొన్ని టూరిస్టు స్పాట్‌లను పర్యటించారు. గేట్ వే ఆఫ్ ఇండియా, గిర్గావ్ చౌపట్టి వంటి చోట్లకు వెళ్లారు. ఆ తర్వాత బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్‌కు(కోస్టల్ ఏరియా) సాయంత్రం పూట వెళ్లారు.

గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆమె మతాన్ని అంగీకరించినట్టు ఆకాశ్ ముఖర్జీ చెప్పాడు. అదే సందర్భంలో ఆమెను తనతో ఇంటిమేట్ కావాలని కోరాడు. కానీ, సెక్స్‌లో పాల్గొనడానికి తిరస్కరించింది. దీంతో ఆకాశ్ ముఖర్జి ఆమె గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. ఆమె తలను బండరాళ్లకేసి బాదాడు. అంతేకాదు, ఓ డ్రైన్‌లో ఆమెను ముంచేయాలని ప్రయత్నించాడు. కానీ, ఆమె సహాయం కోసం కేకలు వేసింది.

Also Read: వలసవాద చట్టమైతే ఏంటీ? రాజద్రోహ చట్టం అవసరం.. శిక్ష మరింత కఠినంగా ఉండాలి: కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ రిపోర్ట్

ఆ స్పాట్‌లో ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆకాశ్ ముఖర్జీని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ యువతిని హాస్పిటల్ తరలించారు.

ఆ యువతి స్టేట్‌మెంట్ ఆధారంగా బాంద్రా పోలీసులు ముఖర్జీని అరెస్టు చేశారు. హత్యా ప్రయత్నం కింద కేసు పెట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉన్నదని అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios