Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగం కోసం వెడితే యువతిని ప్రేమలో దింపి.. సరోగసి రాకెట్ లో ఇరికించి..

అక్కడ పని చేస్తున్న వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. మామూలుగానే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే అనుకోకుండా వారు పనిచేస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్ మూసివేశారు. దీంతో ఆ మహానగరంలో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 

Mumbai Crime : Job hunt lands Malad woman in surrogacy racket
Author
Hyderabad, First Published Oct 19, 2021, 7:39 AM IST

ముంబై : ప్రియుడి మాట విని Surrogacyకి ఒప్పుకుంది ఓ యువతి. అయితే అనుకోకుండా కథ అడ్డం తిరగడంతో చిక్కుల్లో పడింది. చివరకు పోలీసుల రంగప్రవేశంతో ఆ యువతి ఉచ్చులోంచి క్షేమంగా బయటపడింది. 

ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే.. ముంబైలోని మలద్ కు చెందిన 22 యేళ్ల యువతి ఉద్యోగాన్వేషణలో ముంబై వచ్చింది. అక్కడ job వెతుక్కునే క్రమంలో నవీ ముంబైలో ఆమెకు ఉద్యోగం దొరికింది. అక్కడి ఓ డయాగ్నస్టిక్ సెంటర్ లో చేరింది. 

కొన్ని రోజుల తరువాత అక్కడ పని చేస్తున్న వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. మామూలుగానే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే అనుకోకుండా వారు పనిచేస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్ మూసివేశారు. దీంతో ఆ మహానగరంలో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 

ఇది ప్రియుడికీ తెలుసు. దీన్ని అతను అలుసుగా తీసుకున్నాడు. సరోగసికి ఒప్పుకుంటే డబ్బులు వస్తాయని కష్టపడకుండా ఉండొచ్చని చెప్పాడు. ఆమెను ప్రోత్సహించాడు. అంతేకాదు జాబ్ కంటే ఎక్కువగా రూ.4నుంచి 5 లక్షల వరకు డబ్బు వస్తుందని నమ్మించాడు. 

loverని గుడ్డిగా నమ్మిన ఆమె.. అందుకు అంగీకరించింది. వెంటనే ఆ ప్రియుడు ఆమెను హైదరాబాద్ కు పంపాడు. ఈ క్రమంలో వారు టోకన్ అడ్వాన్స్ కింద కొంత సొమ్మును కూడా తీసుకున్నారు. ఆగస్టు నెలలో ఆ యువతికి సరోగసి పరీక్షలు చేసిన వైద్యులు అందుకు ఆమె పనికి రాదని తెలిపారు. 

కోర్టులోనే లాయర్‌పై తుపాకీతో కాల్పులు.. దారుణ హత్య

ఈ ఊహించని పరిణామంతో వారు షాక్ అయ్యారు. డబ్బులు వస్తాయన్న ఆమె ఆశలు ఆడియాసలయ్యాయి. వారి దగ్గర తీసుకున్న టోకెన్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో కట్టలేకపోయింది. ఆమె ద్వారా డబ్బు పరంగా తనకెటువంటి లాభం లేదని గ్రహించిన ప్రియుడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు. 

ఇక ఏం చేయాలో తెలియక ఆ యువతి సెప్టెంబర్ 28న తన తల్లికి ఫోన్ చేసింది. తల్లి సదరు యువతిని పోలీసుల దగ్గరికి వెళ్లమని చెప్పింది. ఆ రతువాత యువతి తల్లి తన కూతురు కనిపించడం లేదని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హైదరాబాద్ లో ఉన్న యువతిని ముంబైకి తీసుకువచ్చారు. 

విచారణలో ఆమె జరిగిందంతా పోలీసులకు చెప్పింది. ప్రియుడి మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిమీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios