సెక్రటేరియట్ లో నానా హంగామా చేసిన పోలీసు భార్య

First Published 6, Jul 2018, 10:38 AM IST
Mumbai: Cop's wife shouts slogans at Mantralaya, held
Highlights

సెక్రటేరియట్ లో పోలీసు భార్య రచ్చ
అరెస్టు చేసిన పోలీసులు
 

పోలీసు ఉన్నతాధికారి భార్య.. సెక్రటేరియట్ లో నానా హంగామా చేసింది. ఆమె చేసిన హంగామాకి.. ఒక్కసారిగా ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఆమెను అదుపుచేసేందుకు పోలసులే ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యశశ్రీ పాటిల్ అనే మహిళ మహారాష్ట్ర పోలీస్ భార్యల సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు నిన్న ఆమె రాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’కు వెళ్లారు. 

వినతిపత్రం ఇచ్చే వరకు మౌనంగానే ఉన్న యశశ్రీ... ఆ తర్వాత నేరుగా మూడో అంతస్తులోకి వెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ‘‘వందేమాతరం’’, ‘‘జై కిసాన్’’ అంటూ బిగ్గరగా నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.

దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ జరిపిన అనంతరం ఆమెను విడుదల చేసినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

loader