ముంబయికి చెందిన మైనర్ బాలుడు ఓ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. ఇంటర్నెట్‌లో కొరియర్ గూడ్స్‌పై ఇన్సూరెన్స్ పాలసీ యాడ్ చూసి ఓ ఫ్రాడ్ కోసం ప్లాన్ వేశాడు. తానే కొన్ని గూడ్స్‌ను తయారు చేసి మార్గం మధ్యలోనే పేలిపోయేలా ప్లాన్ చేశాడు.
ముంబయి: ఓ మైనర్ బాలుడు ఊహించిన విధంగా ఓ ఫ్రాడ్ చేయబోయాడు. కానీ, అతని ప్లాన్ బెడిసికొట్టింది. చివరకు పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. ఆ బాలుడు వేసిన పథకంలో కొరియర్ ఆఫీసు ధ్వంసం అయింది. అసలు ఏం జరిగిందంటే..?
మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన ఓ బాలుడు ఆన్‌లైన్‌లో ఓ అడ్వర్టయిజ్‌మెంట్ చూశాడు. ట్రాన్స్‌పోర్టేషన్‌లో గూడ్స్ డ్యామేజీ కోసం ఇన్సూరెన్స్ పాలసీ కనిపించింది. దీంతో ఆ పిల్లాడు ఓ ఫ్రాడ్ చేయడానికి ప్లాన్ వేశాడు. అన్ని నకిలీ వస్తువులను కొరియర్ చేసి.. అవి డెలివరీకి ముందే మార్గం మధ్యలోనే పేలిపోయేలా ప్లాన్ చేశాడు. వస్తువులు కొన్నట్టు నకిలీ ఇన్వాయిస్‌ల మీద పాలసీ కొన్నాడు.
ఆ మైనర్ బాలుడు ఫైర్ క్రాకర్స్‌తో ఎలక్ట్రిక్ సర్క్యూట్ అసెంబుల్ చేశాడు. ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ బ్యాటరీ తయారు చేశాడు. మొబైల్ ఫోన్‌లో అలారమ్ సెట్ చేసి.. అలారమ్‌ను పేలుడుకు ట్రిగ్గర్‌గా సెట్ చేశాడు. అలాగే, రెండు కంప్యూటర్ ప్రాసెస్‌లు, ఒక మొబైల్ ఫోన్, ఒక మెమరీ కార్డుల నకిలీ ఇన్వాయిస్‌లు తయారు చేశాడు. మొత్తంగా రూ. 9.8 లక్షల ఇన్వాయిస్‌లను తయారు చేశాడు.
ఈ డివైజ్‌ను పార్సిల్ కవర్‌లో ప్యాక్ చేశాడు. దీనికి ఢిల్లీలో ఓ ఫేక్ అడ్రెస్ పెట్టాడు.
ఈ పార్సిల్‌ను ఓ కొరియర్ సంస్థ ఉద్యోగి శాంతాక్రజ్‌లోని బాలుడి నివాసం నుంచి తీసుకెళ్లాడు. ఆ కొరియర్ కవర్‌ను జోగేశ్వరి ఏరియాలోని కొరియర్ ఆఫీసులో ఉంచాడు. అక్కడే ఆ పార్సిల్ కవర్ మంగళవారం రాత్రి పేలిపోయింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు కొరియర్ కవర్‌పై ఉన్న అడ్రస్‌తో మైనర్ బాలుడిని ట్రాక్ చేశారు. శుక్రవారం ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఆ బాలుడిని ఈ నెల 27వ తేదీ వరకు చిల్డ్రన్స్ హోమ్‌లో ఉంచనున్నారు. దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
