New Delhi: "రెండు దేశాల ప్రజల మ‌ధ్య ద్వేషం ఏ విష‌యాన్ని ప‌రిష్కరించదు. ఇరు దేశాల మధ్య వాతావరణం ఉత్కంఠగా ఉంటుంది. మేము ముంబయికి చెందిన వాళ్లం.. ఉగ్రవాద దాడులను కళ్లారా చూశాం. దాడికి  పాల్పడ్డవారు ఇప్ప‌టికీ లాహోర్ లో స్వేచ్ఛ‌గా తిరుగుతున్నారు. దీనికి భారతీయులకు కోపం రాదా.." అంటూ ప్ర‌ముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావేద్‌ అక్తర్ పాకిస్తాన్ లో చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.  

Celebrated writer and poet Javed Akhtar: భార‌తీయుల గుండెల్లో గాయాన్ని నింపిన ఘ‌ట‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌ముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావేద్‌ అక్తర్ పాకిస్తాన్ లో ఆ దేశంపై త‌న స్పీచ్‌తో సర్జికల్‌ స్ట్రైక్ చేశారు. పాక్ గ‌డ్డ‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ.. చాలా మంది అభినంద‌న‌లు తెలిపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ముంబ‌యి 26/11 దాడుల‌కు పాల్ప‌డిన ఉగ్రవాదులు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ భారతీయుల గుండెల్లో చేదు జ్ఞాప‌కాల‌ను నింపిన ఘ‌ట‌న గురించి పాకిస్తాన్ లో ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్ లో జరిగిన ఒక కార్య‌క్ర‌మం కోసం జావేద్ అక్తర్ గత వారం పాకిస్తాన్ కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ.. భార‌తీయుల గుండెల్లో గాయాన్ని నింపిన 26/11 ఘ‌ట‌ను ప్ర‌స్తావిస్తూ పాకిస్తాన్ లోనే ఆ దేశంపై త‌న స్పీచ్‌తో సర్జికల్‌ స్ట్రైక్ చేశారు. పాక్ గ‌డ్డ‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం గురించి జావేద్ అక్త‌ర్ మాట్లాడుతూ, ముంబయి ఉగ్రదాడులకు పాల్ప‌డిన వారు లాహోర్ లో స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌నీ, భార‌తీయుల గుండెల్లో చెర‌గ‌ని గాయం చేసిన వారిప‌ట్ల కోపం, ఆగ్ర‌హం ఉంటుంద‌నీ, ఈ విష‌యంలో భారతీయులను పాకిస్తాన్ నిందించజాలదని అన్నారు. సభలో ఉన్న ఓ వ్యక్తి.. 'మీరు చాలాసార్లు పాకిస్థాన్ ను సందర్శించారు. మీరు తిరిగి వెళ్ళినప్పుడు, వారు మంచి వ్యక్తులు అని మీ ప్రజలకు చెబుతారా? వారు మమ్మల్ని బాంబులు వేయడమే కాకుండా, పూలదండలు..ప్రేమతో పలకరిస్తున్నార‌ని చెబుతారా? అని ప్ర‌శ్నించారు. దీనికి జావేద్ అక్తర్ స్పందిస్తూ.. 'మనం ఒకరినొకరు నిందించుకోకూడదు. అది దేనికీ పరిష్కారం చూపదు. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది, దానిని చల్లార్చాలి. మేము ముంబ‌యికి చెందిన వాళ్లం, మా నగరంపై కళ్లారా చూశాం. వారు (దాడి చేసినవారు) నార్వే లేదా ఈజిప్ట్ నుండి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయుల కోపానికి అర్థం ఉంది. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు" అంటూ వ్యాఖ్యానించారు. 

Scroll to load tweet…

అలాగే, పాక్ లెజెండ్స్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విధంగా భారత కళాకారులకు పాకిస్థాన్ లో స్వాగతం లభించలేదని కూడా ఆయ‌న గుర్తు చేశారు. 'ఫైజ్ సాహెబ్ వచ్చినప్పుడు ఆయనను చాలా ముఖ్యమైన సందర్శకుడిలా ఆహ్వానించారు. అది అన్ని చోట్లా ప్రసారమైంది. నుస్రత్ ఫతే అలీఖాన్, మెహదీ హసన్ ల పెద్ద ఫంక్షన్లను నిర్వహించాం. మీరు (పాకిస్తాన్) లతా మంగేష్కర్ కోసం ఎప్పుడూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించగలిగారా" అని ఆయ‌న వ్యాఖ్యానించడంతో అక్క‌డున్నవారు హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టారు. కాగా, పాకిస్తాన్ గ‌డ్డ‌పై జావేద్ అక్తర్ ఇలా వ్యాఖ్యలు చేయ‌డంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు దీన్ని పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్ గా అభివర్ణించారు.