Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి.. హడలిపోతున్న స్థానికులు.. 

గోరెగావ్ తూర్పులోని ఆరే కాలనీ ఆవరణలో సోమవారం సాయంత్రం 4 ఏళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. ఆ బాలుడు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. 

Mumba Boy attacked by leopard in Aarey colony
Author
First Published Oct 5, 2022, 1:42 AM IST

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో చిరుతపులి కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని అడవుల్లో నుంచి తరచూ వస్తూ పశువులపై దాడి చేస్తోంది. దీంతో గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. తమ పొలాల్లోనూ సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా.. సోమవారం సాయంత్రం చిరుతపులి దాడిలో నాలుగేళ్ల బాలుడుపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రంగా  గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. దాడి సమయంలో ఆ బాలుడు  తన తండ్రితో ఉన్నాడు. అదే సమయంలో వెనుక నుంచి చిరుత  బాలుడిపై దాడి చేసింది. చిరుత పొదల్లో పొంచి ఉంది. ఆ తండ్రి కొడుకుల ఆర్త‌నాదాలు విన్నచుట్టుపక్కల వారు ఎలాగోలా.. ఆ చిన్నారిని కాపాడారు. దాడిలో ఆ చిన్నారి వీపుపై, కాలుపై గాయాలయ్యాయి.  స్థానికులు అప్రమత్తమైన వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని జోగేశ్వరి ట్రామా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై అటవీ అధికారి మాట్లాడుతూ.. ఆ బాలుడు నవరాత్రి గర్బా ఆడేందుకు త‌న తండ్రితో క‌లిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆ చిన్నారి వీపుపై, కాలుపై గాయాలయ్యాయి.  స్థానికులు అప్రమత్తమైన వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని జోగేశ్వరి ట్రామా ఆసుపత్రికి తరలించారు. వివిక్త ప్రదేశాలలో, ముఖ్యంగా రాత్రి సమయంలో వీధి లైట్లు లేని సమయంలో వెళ్లడం చాలా ప్రమాదకరం. ఇలాంటి అనేక సంఘటనలు జ‌రుగుతుండ‌టంతో తరచుగా స్థానికులకు హెచ్చిస్తున్నామ‌ని అధికారి తెలిపారు.

 ఈ చిరుతపులిని గుర్తించడానికి,  సంఘటన జరిగిన ప్రాంతంలో  CCTV  కెమెరాను ఏర్పాటు చేసామని, చిరుత సంచారం గురించి తెలిస్తే స‌మాచారం అందించాల‌ని  తెలిపారు. పెద్ద పిల్లులు ఎక్కువగా ఉండే సున్నిత ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్నట్లు అటవీ అధికారి తెలిపారు.

రిపోర్టు ప్రకారం.. ఇటీవలి కాలంలో అడవి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ నుండి సెటిల్మెంట్ ప్రాంతాలలో చిరుతలు విచ్చలవిడిగా సంచరిస్తున్న సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వ‌చ్చాయి. ఇటీవల.. పొవాయ్ ప్రాంతంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బాంబే (IIT-B) క్యాంపస్‌లో  చిరుతపులి కనిపించిందని స‌మాచారం. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సరిహద్దులో 550 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది.  

అలాగే.. గత కొన్ని రోజులుగా గోరేగావ్‌లో చిరుతపులి కలకలం రేపుతోంది. ఇటీవల గోరేగావ్‌లో ఓ మహిళపై చిరుతపులి దాడి చేసింది. నిర్మలా రాంబదన్ సింగ్(55) అనే మహిళపై దాడి చేసింది. స్థానికులు అప్ర‌మ‌త్తం కావ‌డంతో ఆమె గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. వీరి సీసీటీవీ ఫుటేజీలు కూడా వెలుగులోకి వ‌చ్చింది. అలాగే..  ఆగస్టులో ఓ చిన్నారిపై చిరుతపులి దాడి చేసింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios