ముఖేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. తీవ్ర పరిణామాలు ఉంటాయని మరో రెండు మెయిల్స్..

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ముఖేశ్ అంబానీకి హత్య బెదిరింపులకు సంబంధించి మరో రెండు ఈమెయిల్స్  వచ్చాయి.

Mukesh Ambani receives two more threat mails details here ksm

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ముఖేశ్ అంబానీకి హత్య బెదిరింపులకు సంబంధించి మరో రెండు ఈమెయిల్స్  వచ్చాయి. ముఖేష్ అంబానీకి అక్టోబరు 31- నవంబర్ 1 మధ్య మరోసారి రెండు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని పోలీసులు తెలిపారు. మునుపటి ఈమెయిల్‌ల మాదిరిగా విస్మరిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రూ. 400 కోట్ల డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే గతంలో ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తే తాజా ఈమెయిల్స్ పంపారని పోలీసులు నిర్దారణకు వచ్చారు.

ఇక, ముఖేశ్ అంబానీకి తొలు అక్టోబర్ 27న హత్య బెదిరింపులకు సంబంధించి తొలి ఈమెయిల్ వచ్చింది. ఆ సమయంలో నిందితుడు రూ.20 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే ఆ తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచుతూ మరో రెండు మెయిల్స్ పంపాడు. రూ. 20 కోట్లు ఇవ్వకపోతే.. తాము ముఖేష్ అంబానీని చంపేస్తామని.. భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారని మెయిల్‌లో పేర్కొన్నాడు. రెండో మెయిల్‌లో రూ. 200 కోట్లు చెల్లించాలని లేకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. 

 తాను పంపిన మెయిల్స్‌కు అంబానీ స్పందించ‌క‌పోవ‌డంతోనే రూ. 200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా నిందితుడు పేర్కొన్నాడు. తమ డిమాండ్‌లు నెరవేర్చకుంటే.. డెత్ వారెంట్ (అంబానీకి) జారీ చేయబడుతుందని నిందితుడు పేర్కొన్నాడు. ఆ తర్వాత మరోమారు రూ. 400 కోట్లు డిమాండ్ చేశాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios