దేశంలోని సైక్లిస్టులు ఎంతగానో ఎదురు చూసే ఎంటీబీ హిమాచల్ జంజెహ్లి 2022 ఫ‌స్ట్ ఎడిష‌న్ మౌంటైన్ బైకింగ్ రేసు ఫస్ట్ ఎడిషన్ ఎల్లుండి నుంచి మొదలవనుంది. ఏ రూట్ల గుండా ఈ రేసు సాగుతుంది ? ఈ అడ్వెంచర్స్ ఎలా ఉంటాయి ? మొత్తం ఎన్ని కిలో మీటర్ల పాటు ఈ రేసు నిర్వహిస్తారు వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దీనిని చదవాల్సిందే.. 

ఈ నెల 23వ తేదీ నుంచి ఎంటీబీ హిమాచల్ జంజెహ్లి 2022 ఫ‌స్ట్ ఎడిష‌న్ మౌంటైన్ బైకింగ్ రేసు ప్రారంభం కానుంది. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న 50 మంది అగ్రశ్రేణి సైక్లిస్టులు పాల్గొనున్నారు. హిమాలయన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం ప్రమోషన్ అసోసియేషన్ (HASTPA), హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంయుక్తంగా ఈ పోటీలను నిర్వ‌హిస్తున్నాయి. ఈ పోటీలు నాలుగు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. 

రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రేసు చారిత్రాత్మకమైన రిడ్జ్, సిమ్లా ప్రధాన పట్టణం చుట్టూ కొన‌సాగుతుంది. దీని వ‌ల్ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సాంప్రదాయ వారసత్వం, సంస్కృతి ప్రపంచం అంతా చూస్తుంది. ఈ రేసును హిమాచల్ ప్రదేశ్ ప్రజలు చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. 

వామ్మో.. తాగింది, ఊగింది.. పోలీసును పట్టుకుని బాదింది.. మద్యంమత్తులో రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

సిమ్లాలో జూన్ 23 వ తేదీన ఈ పోటీల ప్రధాన జెండా ఆవిష్కరణ జ‌రిగి జూన్ 26వ తేదీన సుందరమైన పట్టణం జంజెహ్లిలో ముగుస్తుంది. ఈ పోటీల్లో పాల్గొన‌డానికి, అస‌లైన అడ్వెంచ‌ర్ ను ఆస్వాదించ‌డానికి దేశం నలుమూలల నుండి ఎంతో మంది రైడ‌ర్లు వ‌స్తారు. సిమ్లాలోని హిస్టారిక్ రిడ్జ్ నుంచి జూన్ 23న సాయంత్రం 4.30 గంటలకు జెండా ఊపి ప్రారంభిస్తారు. నాలుగు రోజుల్లో రైడర్స్ హిమాచల్ ప్రదేశ్ బ్యాక్ కంట్రీ బాటల గుండా 175 కిలోమీటర్ల దూరాన్ని (సుమారు) ప్రయాణించి, షికారీ దేవి బేస్ వద్ద గరిష్టంగా 2750 మీటర్ల ఎత్తుకు చేరుకుంటారు. మొత్తంగా 3880 మీటర్ల ఎత్తుకు వెళ్తారు. ఈ రేసు దేశంలో అత్యంత క్లిష్టమైన రేసుగా మారనుంది. ఇక్కడ రైడర్లు నాలుగు రోజుల పాటు XC, MTB, ఆఫ్-రోడ్, బ్రోకెన్ టార్మాక్, గ్రావెల్, రాక్స్, బురద, ఇసుక, లూస్ రాక్ లను ఎదుర్కొని రైడ్ చేయాల్సి ఉంటుంది. 

ఎమ్ టీబీ హిమాచల్ జంజెహ్లీ 2022 ఫస్ట్ ఎడిషన్ పూర్తి వివ‌రాలు వివరాలు

సెరిమోనియల్ ఫ్లాగ్-ఆఫ్ : జూన్ 23 సాయంత్రం 4:30 గంటలకు (హెరిటేజ్ రైడ్) సిమ్లా పట్టణం నుండి సుంద‌ర‌మైన డాక్ బంగ్లా వ‌ర‌కు.. 

స్టేజ్ 1 : జూన్ 24 ఉదయం 7 గంటలకు, డాక్ బంగ్లా నుండి చిండి (నైట్ హాల్ట్) అందమైన ఆపిల్ పొలాల వ‌ర‌కు.. 

స్టేజ్ 2: జూన్ 25 ఉదయం 7 గంటలకు, చిండి స్టేజ్ ప్రారంభమై.. జంజెహ్లీ (నైట్ హాల్ట్) వ‌ర‌కు చేరుకుంటుంది. 

స్టేజ్ 3: జూన్ 26 ఉదయం 7 గంటలకు జంజెహ్లీలో మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. తరువాత ముగింపు వేడుక నిర్వ‌హిస్తారు. 

రూట్ ముఖ్యాంశాలు:

రాష్ట్రం పేరు : సిమ్లా
మొత్తం ఎన్నిరోజులు - 4
రైడింగ్ కొనసాగే రోజులు - 3
ఎంత దూరం - 175 కిలో మీట‌ర్లు 
గరిష్ట ఎత్తు : సుమారు 2750 మీటర్లు
కనీస ఎత్తు : సుమారు 800 మీటర్లు

రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రేస్ జ‌రిగే రూట్ వివరాలు :

మొదటి రోజు - జూన్ 23: సిమ్లా- సంజౌలి-ధల్లి-మషోబ్రా-దాక్ బంగ్లా (డాక్ బంగ్లాలో నైట్ హాల్ట్).

రెండో రోజు - జూన్ 24 : డాక్ బంగ్లా - సిపూర్ - బల్దేయాన్ - నల్దేహ్రా - బసంత్ పూర్ - చాబా - సున్నీ - తత్తాపానీ - అల్సిండి-కోట్ బ్యాంక్ - చురాగ్ - చిండి. (చిండి వద్ద నైట్ హాల్ట్)

మూడో రోజు - జూన్ 25 : చిండి-చిండి స్కూల్ - కోట్-కర్సోగ్ మార్కెట్ - సనార్లి-శంకర్ డెహ్రా - రాయ్ గఢ్ - బులాహ్-జంజెహ్లి మార్కెట్. (జంజెహ్లీ వద్ద నైట్ హాల్ట్)

నాలుగో రోజు - జూన్ 26 : జంజెహ్లీ - జరోల్ - బనియాద్ - తునాగ్ - జరోల్-జంజెహ్లీ. (జంజెహ్లీ వద్ద నైట్ హాల్ట్)