సారాంశం


కొత్త పార్లమెంట్ భవనంలో  లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారంనాడు మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి . పాత పార్లమెంట్ భవనం నుండి  కొత్త పార్లమెంట్ భవనం వరకు  ప్రధాని నరేంద్ర మోడీ సహా  ఎంపీలు  పాదయాత్రగా  కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.   కొత్త పార్లమెంట్ భవనంలో తమ తమ స్థానాల్లో  ఎంపీలు కూర్చుకున్నారు.  జాతీయ గీతంతో  లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనానికి  పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టారు. ఈ సందర్భంగా  లోక్ సభ స్పీకర్  ఓంబిర్లా ప్రసంగించారు.