Asianet News TeluguAsianet News Telugu

మంత్రగత్తె అనుమానం.. మహిళను నగ్నంగా చేసి, దాడి.. వీడియో వైరల్...

భోపాల్ లో black magic చేస్తుందన్న అనుమానంతో ఓ మహిళపై బంధువులు, ఇరుగుపొరుగువారే అమానుషంగా ప్రవర్తించారు. అంతేకాకుండా దాన్ని మొత్తం వీడియో తీశారు. social media లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 

MP woman stripped, beaten on suspicion of black magic; 3 arrested
Author
Hyderabad, First Published Oct 9, 2021, 7:46 AM IST

భోపాల్ : ఏదో నెపంతో మహిళలను అనుమానించడం, వారిమీద దాడులు చేయడం, లైంగికంగా వేధించడం ఘటనలు ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు మూఢనమ్మకాలు మహిళల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్నాయి. చదువుకున్నవారు, చదువులేని వారు అనే తేడా లేకుండా ఈ మూఢనమ్మకాలకు బలవుతున్నారు. 

మదనపల్లెలో చదువుకుని, ఉన్నతస్థానాల్లో ఉన్న తల్లిదండ్రులే తమ బిడ్డల్ని అత్యంత కర్కశంగా చంపిన ఘటన దేశాన్నే వణికించింది. అలాంటి ఘటనను ఇంకా మరిచిపోకముందే.. భోపాల్ లో మూఢనమ్మకాలు, అనుమానాలు ఓ స్త్రీని అత్యంత దారుణంగా అవమానించేలా చేశాయి. వివరాల్లోకి వెడితే...

భోపాల్ లో black magic చేస్తుందన్న అనుమానంతో ఓ మహిళపై బంధువులు, ఇరుగుపొరుగువారే అమానుషంగా ప్రవర్తించారు. అంతేకాకుండా దాన్ని మొత్తం వీడియో తీశారు. social media లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మాండవి గ్రామంలో ఈ నెల 5న ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. woma ఎలాంటి ఆచ్చాదన లేకుండా కూర్చుని ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఆమె మీద దాడి చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 

యాసిడ్ దాడి బాధితురాలికి రూ. 10 లక్షలు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..

బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ నెల 7న మనావర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె మంత్రగత్తె అని, చేతబడి చేయడం వల్లే మ కుటుంబంలోని మహిళ నిత్యం అనారోగ్యంతో బాధపడుతుందని పొరుగింటి కుటుంబం అనుమానించింది.

దీంతో బాధిత మహిళను ఇంట్లోంచి బయటకు ఈడ్చుకు వచ్చి దాడి చేశారు. ఆమె దుస్తులు తొలగించి చావబాదారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన రికార్డు చేసిన వ్యక్తిమీదా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios