యాసిడ్ దాడి బాధితులు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబులిటీస్ చట్టం ప్రకారం.. పరిహారానికి, పునరావాసానికి అర్హులని పేర్కొన్న Bombay HC నగరానికి చెందిన ఓ బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని, అదీ మూడు నెలల్లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

ముంబయి : ప్రేమించలేదని, తనను కాదని వేరే వ్యక్తిని ఇష్టపడిందని, అవమానించిందని ఇలా రకరకాల కారణాలతో అమ్మాయిల మీద యాసిడ్ తో అటాక్ చేయడం మామూలుగా మారిందో సమయంలో. ముఖం మీద యాసిడ్ పోయడం వల్ల ప్రాణాలు కోల్పోయినవారు, కళ్లు కోల్పోయి జీవితాంతం అంధులుగా మారిన వారు. అందవిహీనంగా మారి, అంతకు ముందున్న జీవితాన్ని తిరిగి పొందలేక బాధిత మహిళలు నరకం అనుభవిస్తారు.

ఇలాంటి ఘటనల్లో నిందితులకు ఎంత పెద్ద శిక్షలు వేసినా బాధితులకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయలేరు. అలాంటి ఓ యాసిడ్ దాడి ఘటనలో ముంబై హై కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. భర్త చేతిలో యాసిడ్ దాడికి గురైంది ఓ వివాహిత. ఆమె కేసును పరిశీలించిన హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. దాని వివరాల్లోకి వెడితే.. 

యాసిడ్ దాడి బాధితులు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబులిటీస్ చట్టం ప్రకారం.. పరిహారానికి, పునరావాసానికి అర్హులని పేర్కొన్న Bombay HC నగరానికి చెందిన ఓ బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని సూచించింది. అలాగని పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ యేళ్ల తరబడి తిప్పుకోకుండా.. మూడు నెలల్లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

మర్డర్ కేసులో డేరా బాబా దోషి.. తేల్చిన సీబీఐ న్యాయస్థానం

జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మాధవ్ జమదార్ ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, పరిహారం చెల్లించడంతోపాటు యాసిడ్ దాడితో దెబ్బతిన్న... ఆమె ముఖం మునుపటిలా మారేందుకు చేయించుకునే శస్త్ర చికిత్స ఖర్చులు, ఇతర వైద్య పరమైన అవసరాలను భరించాలని కూడా ప్రభుత్వాని తెలిపింది. 

2010లో ఓ వివాహిత మీద భర్త దాడి చేశాడు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య అని కూడా చూడకుండా ఆమె మీద acid attack చేశాడు.. ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా. ఆ మహిళ దరఖాస్తు విచారణ సందర్భంగా హైకోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.