Asianet News TeluguAsianet News Telugu

నవనీత్ కౌర్, రవి రాణాలకు మే 6వరకు జ్యడిషీయల్ రిమాండ్: ఈ నెల 29న బెయిల్ పిటిషన్లపై విచారణ

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలకు ముంబైలోని బాంద్రా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దేశ ద్రోహం కేసులో వీరిద్దరిని ముంబై పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. 

MP Navneet Rana Her MLA Husband Ravi Rana Sent To 14 Days Of Judicial Custody
Author
Mumbai, First Published Apr 24, 2022, 2:59 PM IST | Last Updated Apr 24, 2022, 2:59 PM IST

ముంబై:  అమరావతి ఎంపీ Navneet Kaur, ఆమె భర్త ఎమ్మెల్యేRavi Rana కు ముంబై కోర్టు  ఆదివారం నాడు 14 రోజు రిమాండ్ విధించింది. 

మహారాష్ట్ర సీఎం Uddhav Thackeray ఇంటి ముందు Hanuman Chalisa పారాయణం చేస్తానని ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈ వ్యాఖ్యలు చేసిన  నవనీత్ కౌర్ నివాసం ముందు శివసేన కార్యకర్తలు ఆందోళనలు చేశారు. మరో వైపు ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నాడు నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త రవి రాణాలను పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు ఉదయం  బాంద్రాలోని కోర్టులో వారిని హాజరుపర్చారు. వీరిద్దరికి ఈ ఏడాది మే 6వ తేదీ వరకు జ్యూడిషీయల్ రిమాండ్ విధించింది కోర్టు.

అయితే నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలను తమ కస్టడీకి ఇవ్వాలని బాంద్రా కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై ఈ నెల 29న విచారించనుంది కోర్టు.ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రాణాలపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

ఈ నెల ప్రారంభంలో హనుమాన్ జయంతి రోజున తన నివాసంలో శివసేన అధినేత ఠాక్రే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలని రవి రాణా డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తానే సీఎం నివాసంలో  హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని ప్రకటించారు. శనివారం నాడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్తామని ప్రకటించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య సృష్టించ వద్దని ఠాక్రే ఇంటికి వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

ఈ పరిణామాలతో నవనీత్ కౌర్ ,రవి రాణాలపై ఐపీసీ సెక్షన్ 153ఎ, 135 ప్రకారంగా కేసులు నమోదు చేశారు. నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త రవి రాణాలకు కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వీరికి బెయిలివ్వాలని కోరుతూ వారి లాయర్ రిజ్వాన్ మర్చంట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఈ నెల 27వ తేదీ లోపుగా తెలపాలని కోర్టు కోరింది.

అయితే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ నవనీత్ కౌర్, రవి రాణాల వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకు వస్తాయని పేర్కొన్నారు.అయితే ఈ వాదనలతో నవనీత్ కౌర్ లాయర్ ఏకీభవించలేదు. శనివారం నాడు సాయంత్రం సబర్బన్ ఖార్ లోని నవనీత్ కౌర్ ఇంట్లో వారిని అరెస్ట్ చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios