Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులకు గుడ్‌న్యూస్: టెన్త్ పరీక్షలు రద్దు, కానీ...

కరోనా నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు నిర్వహించని పరీక్షలను రద్దు చేయాలని కూడ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించుకొన్నారు.

MP Board Exam 2020: Remaining 10th Class Exam cancelled, 12th Class Exam to begin on 8th June, confirms CM Shivraj Singh Chouhan
Author
Bhopal, First Published May 17, 2020, 10:45 AM IST


భోపాల్: కరోనా నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు నిర్వహించని పరీక్షలను రద్దు చేయాలని కూడ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించుకొన్నారు.

ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుండి 12వ తరగతి పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలోనే పదోతరగతి పరీక్షలను రద్దు చేయాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం.

also read:విద్యార్థులకు గుడ్‌న్యూస్: 10, 12 తరగతుల పరీక్షలు రద్దు, మార్కులిలా....

ఇదివరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మెరిట్ లిస్టును అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రద్దైన పరీక్షలకు సంబంధించి పాస్ రిమార్క్ తో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాది మార్చి 19 నుండి లాక్ డౌన్ ముగిసే వరకు ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల నుండి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. లాక్ డౌన్ నేపథ్యంలో టెన్త్ తో పాటు 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగిలిన టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. 12వ, తరగతి పరీక్షలను మాత్రం తిరిగి నిర్వహించనున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో టెన్త్, 12 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాలు కసరత్తు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం టెన్త్ , 12వ తరగతుల పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios