Asianet News TeluguAsianet News Telugu

మోటో నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

మార్కెట్లోకి అడుగుపెట్టిన మోటో జీ6, జీ6 ప్లే

Moto G6, Moto G6 Play With 18:9 Displays Launched in India: Price, Specifications, and More

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ మోటో.. భారత మార్కెట్లోకి మరో రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. జీ6, జీ6 ప్లే పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మోటో జీ5 సిరీస్ కి కొనసాగింపుగా వీటిని తయరు చేశారు.

మోటో జి6 వెనుక గ్లాస్ తో కూడిన బాడీతో ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో, డిస్ ప్లేకు కార్నింగ్ గ్లాస్ గొరిల్లా ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.8 గిగా హెర్జ్  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో రెండు రకాల వేరియంట్లు ఇందులో ఉన్నాయి. 

వెనుక భాగంలో 12 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఓఎస్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ యూఎస్బీ పోర్ట్ ను ఈ ఫోన్లో ఏర్పాటు చేయడం జరిగింది. వేగంగా చార్జ్ చేసుకునేందుకు గాను ఫోన్ తో పాటు 15వాట్స్ టర్బో చార్జర్ వస్తుంది. జి6 అమేజాన్ లో మాత్రమే విక్రయానికి ఉంటుంది. 3జీబీ ర్యామ్ ధర రూ.13,999. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,999.

మోటో జి6ప్లే మోడల్ లో జి6 మాదిరిగానే 5.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. కాకపోతే రిజల్యూషన్ హెచ్ డీ మాత్రమే. 18:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. ఇది 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ఉంటుంది. ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, వెనుక 13 మెగాపిక్సల్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 

ఆండ్రాయిడ్ ఓరియో 8.0 పై పనిచేస్తుంది. ఫోన్ తో 15 వాట్ టర్బో చార్జర్ వస్తుంది. జి6 ప్లే ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభిస్తుంది. ధర రూ.11,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే ఫ్లాట్ గా రూ.1,000 తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ, తిరిగి ఫ్లిప్ కార్ట్ కే అమ్మితే రూ.5,100 చెల్లించే హామీలను కూడా ఇస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios