Asianet News TeluguAsianet News Telugu

మోడీకే మెరుగైన రేటు: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల పనితీరుపై ప్రజల అసంతృప్తి


బీజేపీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కంటే ప్రధాని మోడీ పనితీరుపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామం బీజేపీకి కొంత ఇబ్బందిని కల్గిస్తోంది.

MOTN survey: Modi on top but challenges persist as BJP CMs score low
Author
New Delhi, First Published Jan 21, 2022, 11:34 AM IST

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి నెల రోజుల ముందు  ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. 58 శాతం మంది Narendra Modi సర్కార్ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. 63 శాతం మంది మోడీ వ్యక్తిగత పనితీరు అద్బుతంగా ఉందని రేటింగ్ ఇచ్చారు.గత ఏడాది( 2021) ప్రధాని కేవలం 54 శాతం మంది మాత్రమే మోడీ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

corona మొదటి వేవల్ లో మోడీ పనితీరుపై 78 శాతం ప్రజలు ఆమోదం తెలిపారు. అయితే ప్రస్తుతం మోడీ పనితీరుపై 63 శాతం సంతృప్తితో ఉన్నారు.  Prime minister పదవి రేస్ లో మోడీకి సమీప దూరంలో ప్రత్యర్ధులు ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi ప్రధాని పదవి రేసులో  46 శాతం  వెనుకబడి ఉన్నారు.

కరోనా ఇండియాలో ప్రవేశించిన రెండేళ్ల తర్వాత 3.82 కోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే అధికారిక రికార్డుల ప్రకారంగా 4.9 లక్షల మంది కరోనాతో మరణించారు. అయితే 22.2 శాతం మంది ప్రజలు కరోనాను ఎదుర్కోవడంలో Nda ప్రభుత్వం  విజయంగా అభిప్రాయపడుతున్నారు. 2021 ఆగష్టు మాసంలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ లో ప్రజలు మోడీ సర్కార్ తీరుపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

2021 ఆగష్టులో ఎన్డీఏ సర్కార్ పనితీరుతో 53 శాతం మంది మాత్రమే సంతృప్తి చెందారు. ఈ ఏడాది జనవరి 18 నాటికి దేశంలో 1.64 బిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్ పూర్తైంది. కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో చోటు చేసుకొన్న పరిస్థితులను అవగాహన చేసుకొన్న మోడీ సర్కార్ థర్డ్ వేవ్ లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది.60 ఏళ్లు దాటిన వృద్దులకు బూస్టర్ డోసులు, 15 -18 ఏళ్ల వారికి కూడా Vaccination ప్రారంభించడం ప్రభుత్వానికి కలిసి వచ్చిందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

2014 నుండి బీజేపీ తీసుకొన్న అన్ని నిర్ణయాల్లో మోడీ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలోని 12 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మోడీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ మద్దతుతో ఐదు రాష్ట్రాల్లో సీఎంలు కొనసాగుతున్నారు. 

త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మోడీకి అత్యంత ప్రజాదరణ ఉందని ఈ సర్వేలో తేలింది. Uttar Pradesh రాష్ట్రంలో 75 శాతం, గోవాలో 67 శాతం, Manipur లో 73 శాతం, ఉత్తరాఖండ్ లో 59 శాతం, Punjab  లో 37 శాతం మోడీకి ప్రజాదరణ ఉందని C-Voter ఇండియా టుడే సర్వే తేల్చింది.బీజేపీ అధికారంలో లేని పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి రేటింగ్ సగటు కంటే చాలా తక్కువగా ఉందని స్పష్టమైంది.

Odisha కు చెందిన  మొత్తం 2743 మందిలో 71 శాతం మంది నవీన్ పట్నాయక్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన 4982 మందిలో 69.9 శాతం మంది మమత బెనర్జీ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కు 67.5 శాతం, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కు 61.8 శాతం, కేరళ సీఎం పినచయి విజయన్ కు 61.1 శాతం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 57.9 శాతం, అసోం సీఎం హిమంత బిస్వాశర్మ కు 56.6 శాతం, ఛత్తీస్ ఘడ్ సీఎం కు 51.4 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు.

బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం మాత్రమే 50 శాతం ప్రజల సంతృప్తికి చేరింది.  గుజరాత్, ఉత్తరాఖండ్, అసోం, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంల పనితీరు 40 శాతం కంటే ఎక్కువ ఉంది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు 35-40 శాతాల మధ్య రేటింగ్ కలిగి ఉన్నారు. 

హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి, గోవా లలోని సీఎంల రేటింగ్ లు 27 నుండి 35 మధ్య ఉన్నాయి.   గోవా సీఎం ప్రమోద్ సావంత్ 27.2పై సంతృప్తితో ప్రజలున్నారు.బీజేపీకి సంబందించిన సీఎంలలో ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు 48.7 శాతం సంతృప్తితో ఉన్నారని సర్వే తేల్చింది. అయితే ప్రధాని మోడీపై 75 శాతం ప్రజాదరణ ఉంది.

Goaలో 67 శాతం మంది ప్రధాని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పనితీరుపై 27. 2 శాతం మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. మణిపూర్ లో 73 శాతం మంది ప్రధాని మోడీ బాగా పనిచేశారని చెప్పారు. అయితే ఉత్తరాఖండ్  సీఎం బీరెన్ సింగ్ కంటే  ప్రధాని మోడీకి 59 శాతం ఆమోదం పొందారు. సీఎంలకు పుష్కర్ ధామికి 41 శాతం సాధించారు. 

రామ మందిరం అంశంతో పాటు కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు బీజేపీ ఆదరణను పెంచాయి. కేవలం 15.7 శాతం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అత్యున్నత విజయంగా భావిస్తున్నారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అంశం 12 శాతం మాత్రమే భావిస్తున్నారు.

2014 లో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తమ ఆర్ధిక పరిస్థితి అధ్యాన్నంగా ఉందని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. 51 శాతం మంది రానున్న ఆరు నెలల్లో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించడం లేదు. తమ ఆదాయం 64 శాతం క్షీణించిందని 64 అభిప్రాయపడ్డారు. 45 శాతం మంది ఉద్యోగాల కొరతను చాలా తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుండి వచ్చిన డేటా ప్రకారంగా నవంబర్, అక్టోబర్ లలో 7 శాతం, 7.75 శాతం నుండి డిసెంబర్ లో నిరుద్యోగం రేటు 7.91 వద్ద నాలుగు గరిష్ట స్థాయికి చేరుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios