బీహార్ లో దారుణం జరిగింది. ఓ తల్లి, ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా గొంతు కోసుకుని చంపారు. ఈ ఘటన కతిహార్ లోని  బెలాన్ గ్రామ పంచాయతీలో జరిగింది.

బీహార్‌లోని కతిహార్ దారుణం జరిగింది. 35 ఏళ్ల మహిళను, తన ఇద్దరు పిల్లలను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన బలియా బెలోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెలాన్ గ్రామ పంచాయతీలో మంగళవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. మృతులను ఫిరోజ్ ఆలం భార్య సదాబ్ జరీన్ ఖాతూన్ (35), వారి ఇద్దరు పిల్లలు ఫైజాన్ ఫిరోజ్ (6), పాయా ఫిరోజ్ (10)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

సమాచారం ప్రకారం.. మరణించిన మహిళ భర్త సమీపంలోని గ్రామంలో ముహర్రం జాతరను చూడటానికి వెళ్ళాడు. భర్త లేకపోవడంతో నేరస్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరూ చిన్నారులను, తల్లి సదాఫ్ జరీన్‌ను నిర్దాక్షిణ్యంగా చంపడానికి గల కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రతి చిన్న అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై బలియా బెలోన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. హంతకులు మృతురాలికి తెలిసి ఉండవచ్చనీ, ప్రణాళిక ప్రకారం హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లో ఉండలేదన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. పదునైన వస్తువుతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించి తదుపరి విచారజణ జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి పరీక్షల కోసం ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ దారుణ హత్య ఘటనతో ఆ ప్రాంతమంతా సంచలనం రేపింది. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. మనుషులు ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా చంపగలరు? అని ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.