కొడుకు చనిపోయాడని తెలియక.. రాత్రంతా శవానికి సపర్యలు చేసిందో తల్లి.. తీరా విషయం తెలిసాక గుండె పగిలేలా ఏడ్చింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ వ్యక్తి బాత్ రూంలో కిందపడి తలకు గాయం అవ్వడంతో మృతి చెందాడు. అయితే కొడుకు బ్రతికేఉన్నాడనుకున్న అతని తల్లి రాత్రంతా సపర్యలు చేస్తూనే గడిపింది. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ముంబై, కలినా ఏరియాకు చెందిన 42 యేళ్ల వ్యక్తి సోమవారం తాగిన మైకంలో బాత్ రూంలో కిందపడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తరువాత బాత్రూం దగ్గరిక వెళ్లిన తల్లి కొడుకు కదలకుండా పడి ఉండడం చూసి.. అతన్ని బైటికి లాక్కొచ్చింది. 

అతడు బ్రతికే ఉన్నాడని భావించింది. తలకైన గాయానికి పసుపు రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు రాత్రంతా కొడుకు ఎందుకు లేవడంలేదో అంటూ శవానికి సపర్యలు చేస్తూ కూర్చుంది. అయితే తెల్లారినా కొడుకు లేవకపోవడంతో బంధువులకు విషయం చెప్పింది. 

దీంతో వారు అక్కడికి వచ్చి చూసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితుడ్ని ముందు ఆసుపతరికి తరలించారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అతడు చాలా సేపటి క్రితమే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద విచారణ ప్రారంభించారు.