Asianet News TeluguAsianet News Telugu

చిరుత పులితో పోరాడి.. దాని చేతుల నుంచి బిడ్డను కాపాడుకున్న కన్నతల్లి.. గిరిజన మహిళపై ప్రశంసలు

మధ్యప్రదేశ్‌లోని టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని ఓ గ్రామంలో గుడిసె బయట ముంట ముందు చలి  కాచుకుంటుండగా ఓ పులి పిల్లాడిని నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. ఆ తల్లి మిగతా ఇద్దరు పిల్లలను ఇంట్లో భద్రంగా ఉంచి పులి పారిపోయిన వైపుగా అడవిలో ఆ రాత్రి పరుగెత్తింది. కిలోమీటర్ మేర పరుగెత్తి పులిని గుర్తించింది. ఓ కర్రతో పులిని బెదిరించింది. దాని చేతుల నుంచి బిడ్డను లాక్కుంది. వెంటనే ఆ పులి ఆమెపై పంజా విసిరింది. రక్షించండి అన్న ఆమె పిలుపుతో కొందరు గ్రామస్తులు అప్పుడే అక్కడికి చేరడంతో పులి జారుకుంది. ఇప్పుడు ఆ తల్లి, బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి ధైర్యసాహసాలను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ప్రశంసించారు.
 

mother fights leopard for son in madhya pradesh won heart
Author
Bhopal, First Published Dec 1, 2021, 6:31 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భోపాల్: ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు.. ఇది సినిమా డైలాగ్ కావొచ్చు. కానీ, మధ్యప్రదేశ్‌లో ఆ గిరిజన తల్లి((Mother) సాహసాన్ని చూసి అక్షరాల నిజమని నమ్మక తప్పదు. బిడ్డను ఒక తల్లిలాగా మరెవ్వరూ ప్రేమించలేరని, రక్షించలేరని ఆమె ఉదాహరణగా నిలిచారు. ఇంటి ముందు మంట కాచుకుంటుంటే హఠాత్తుగా తన బిడ్డను ఎత్తుకెళ్లిన చిరుత(Leopard)ను ఆమె వేటాడింది. కారు చీకట్లు కమ్ముకున్న అడవిలోకి ఒంటరిగా పరుగెత్తింది. ఆ పులి వెంట బడి కిలోమీటర్ మేరకు అడవిలోకి వెళ్లింది. చిరుత పులి పరుగు ఆపేసి పొదల మాటును దాక్కుంది. దానికి ఎదురు వెళ్లి దాని చేతుల నుంచి బిడ్డ(Son)ను తీసుకెళ్లడానికి ఆ తల్లి ప్రయత్నించింది. ఆ తల్లి బెదిరింపులకు చిరుత పులి కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. బిడ్డను తీసుకున్న తర్వాత ఆ పులి మరో సారి పంజా విసిరింది. కానీ, చివరకు ఆ అడవి నుంచి తన బిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగింది. ఆ తర్వాత పులి గాయాలతో రక్తాలు కారుతున్న ఆ ఇద్దరూ సమీప ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో సంజయ్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని బడీ ఝరియా గ్రామంలో ఆదివారం రాత్రి చలి పెరిగింది. ఆ గిరిజన తల్లి పిల్లల కోసం గుడిసె నుంచి బయట మంట పెట్టింది. తన ముగ్గురు పిల్లలతో మంట ముందు కూర్చున్నారు. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో గమనించలేదు కానీ, ఓ చిరుత పులి వారిని అతి సమీపించింది. పక్కనే ఉన్న ఎనిమిదేళ్ల రాహుల్‌ను నోట కరుచుకుని అడవిలోకి పరుగెత్తింది. ఆ తల్లి కిరణ్ వెంటనే గాబరా పడిపోయి సోలిపోలేదు. మిగతా ఇద్దరు పిల్లలను గుడిసెలో భద్రంగా ఉంచింది. వెంటనే తలుపు తీసి బయటకు నడిచింది. ఆ పులి పారిపోయిన వైపుగా పరుగెత్తిందని టైగర్ రిజర్వ్ డైరెక్టర్ వైపీ సింగ్ తెలిపారు. ఆ పులిని ఆమె కనిపెట్టగలిగింది.

Also Read: ఇంటి ముందు కూర్చున్న మహిళపై దాడి చేసిన చిరుత పులి.. వెనుక నుంచి వచ్చి పంజా.. వీడియో ఇదే

వెంటబడుతున్న కిరణ్ నుంచి తప్పించుకోవడానికి చిరుత పులి ప్రయత్నించింది. కొంత దూరం వెళ్లాక ఆ పిల్లాడిని తన కాళ్ల దగ్గర ఉంచుకుని పొదలచాటున ఆగింది. అది గమనించి కిరణ్ కూడా ఆగింది. ఓ కట్టె చేతిలోకి తీసుకుని పులిని భయపెట్టే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో రక్షించాల్సిందిగా ఊరివాసులకు సంకేతాలిచ్చింది.

బహుశా ఆ తల్లి ధైర్య సాహసాలకు ఆ పులి బెదిరిపోయి ఉండవచ్చునని, అందుకే, ఆ పులి బిడ్డను భూమిపై ఉంచి పక్కకు జరిగిందని వైపీ సింగ్ తెలిపారు. వెంటనే కొడుకుని కిరణ్ దగ్గరకు తీసుకుంది. ఆ పులి కూడా అదే వేగంతో ఆమెపై పంజా విసిరింది. అయినప్పటికీ ఆమె బెదరలేదు. ఆ పులిపై పోరాటానికి దిగింది. దాన్ని ఎదిరించడానికి సాధ్యమైన మేర ప్రయత్నించింది. ఇదే సమయంలో గ్రామస్తులు అక్కడికి సమీపంగా వచ్చారు. ఇక అప్పుడు ఆ పులి మెల్లగా అడవిలోకి జారుకుంది. ఆ బాలుడు, తల్లికి పులి దాడిలో గాయాలయ్యాయి. బాలుడి వీపు, గదవ, కళ్ల దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. బఫర్ జోన్ రేంజర్ అసీమ్ భురియా వారిద్దరినీ ఓ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చేర్చారు. వెంటనే రూ. వెయ్యి సహాయం చేశారు. వారి గాయాల చికిత్సకు అయ్యే ఖర్చును ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ భరిస్తుందని వివరించారు. ఆ తల్లి చేసిన ధైర్య సాహసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios