ఇంటి ముందు కూర్చున్న మహిళపై దాడి చేసిన చిరుత పులి.. వెనుక నుంచి వచ్చి పంజా.. వీడియో ఇదే

మహారాష్ట్రంలోని ఆరే కాలనీ పరిసరాల్లో చిరుత పులి దాడులు పెరుగుతున్నాయి. కొంతకాలంగా ఈ ఏరియాలో చిరుత సంచరిస్తున్నది. ఈ నెలలో ఆరు సార్లు దాడులకు పాల్పడింది. తాజాగా, బుధవారం రాత్రి తన ఇంటి ముందు కూర్చున్న ఓ మహిళపై వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. ఆ మహిళ తన చేతికర్రతో ప్రతిఘటించింది. అరుపులు వేయడంతో ఇరుగుపొరుగు కాపాడటానికి పరుగున వచ్చారు. ఇంతలో ఆ పులి అక్కడి నుంచి జారుకుంది.
 

woman attacked by leopard in mumbai

ముంబయి: ఆ కాలనీ పరిసరాల్లో కొంతకాలంగా చిరుతపులి సంచారం చేస్తున్నది. చీకటి పడితే చాలు కనబడినవారిపై పంజా విసరడానికి ఆ చిరుత కాచుక్కూచుంటున్నది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆరే మిల్క్ కాలనీలో ఈ ముప్పు వెంటాడుతూనే ఉన్నది. ఈ నెలలోనే చిరుత ఆరు సార్లు దాడి చేసింది. తాజాగా బుధవారం సాయంత్రం ఓ మహిళపై వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. ఇంటి ముందు కూర్చున్న ఆ మహిళపై వెనుక నుంచి వచ్చి మీద దూకడంతో ఆమె వెనక్కే పడిపోయింది. తన చేతికర్రతో ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో పులి కాస్త తగ్గింది. అరుపులు వేయడంతో అక్కడి నుంచి జారుకున్నది. అంతలోపే ఇరుగుపొరుగు ఆమె దగ్గరకు వచ్చారు. ఈ దాడిలో ఆమె గదవ, వీపు, చేతికి గాయాలయ్యాయి.

ఆరేలోని బుధవారం సాయంత్రం 7.45 గంటలకు విశవ వర్కర్స్ కాలనీలో 55ఏళ్ల నిర్మలా దేవీ రాంబదన్ సింగ్ ఇంటి నుంచి బయటకు చేతికర్ర పట్టుకుని వచ్చారు. కాసేపు అటు ఇటు తిరిగి ఇంటి ముందు కూర్చున్నారు. కానీ అప్పటికే చిరుత పులి ఆ ఇంటికి సమీపంలోకి చేరింది. నిర్మలా దేవీ నెమ్మదిగా ఇంటి ముందు వచ్చి కూర్చుంటున్న దృశ్యాన్నీ చిరుత క్షుణ్ణంగా పరిశీలిస్తూ పొంచి ఉన్నది. ఆమె కూర్చోగానే ఒక్కసారిగా వెనుక నుంచి ఉరికి వచ్చింది. చిరుత పులి అత్యంత సమీపానికి వచ్చిన తర్వాత ఆమె చూసింది. కానీ, అంతలోపే చిరుత ఆమెపై దాడి చేసింది.

 

చిరుత దాడికి ఆమె ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. కానీ, చేతి కర్రతోనే చిరుతను బెదిరించింది. పడిపోయిన ఆమెను చూస్తూ చిరుత కొంచెం వెనక్కి తగ్గి ఆగి చూసింది. ఇంతలోనే ఆమె మళ్లీ చేతి కర్రతోనే దానిపై దాడికి యత్నించారు. ఆమె అరుపులూ  మొదలుపెట్టడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఇంతలోనే ఇరుగుపొరుగు అక్కడికి చేరుకున్నారు.

కొంతకాలంగా ఆరే కాలనీ చిరుత సంచరిస్తున్నది. రెండేళ్ల చిరుత పిల్లనే ఈ దాడులకు పాల్పడినట్టు అటవీ శాఖ అధికారుల అనుమానిస్తున్నారు.

ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు చిరుత పులి నాలుగేళ్ల బాలుడిని కరుచుకుని పరుగులు పెట్టింది. ఇది గమనించిన స్థానికులు, ఆ బాలుడి బంధువులు చిరుతను వెంటాడారు. కొంత దూరం పరుగెత్తిన తర్వాత బాలుడిని పొదల్లో వదిలి వెళ్లింది. ఆ బాలుడి వీపు, తలకు గాయాలయ్యాయి. ఈ నెల మొదట్లో ఆరే మిల్క్ కాలనీ నివాసి లక్ష్మీ ఉంబెర్సాదె కూడా చిరు దాడికి గురయ్యారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చిరుత ఆమెకు ఎదురుబడింది. ఒక్క ఉదుటన ఆమెపైకి దూకడంతో ఆమె కిందపడిపోయారు. ఆమె కాలికి, తలకు గాయాలయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios