ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ కొన్నేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ఇదే క్రమంలో ఆ మహిళ బిడ్డపైనా ఆ వ్యక్తి కన్నేశాడు. దీంతో తల్లీ, బిడ్డలు కలిసి ఆ వ్యక్తిని తీవ్రంగా దాడి చేసి చంపేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. కొన్నేళ్ల వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు. అయితే.. ఆ మహిళకు 19 ఏళ్ల బిడ్డ కూడా ఉన్నది. ఆ బిడ్డ కూడా వారితోనే కలిసి ఉంటున్నది. ఆ మహిళతో సంబంధంలో ఉన్న వ్యక్తి ఆమె బిడ్డపైనా కన్నేశాడు. దీంతో తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. కూతురు కూడా రగిలిపోయింది. చివరికి ఆ ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిని ఇంటికి పిలిచారు. ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి చంపేశారు. ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో ఘటన చోటుచేసుకుంది.
50 ఏళ్ల మెదిన్ లాల్.. గీత అని మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ కలిసే జీవిస్తున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు. అయితే, మెదిన్ లాల్ తన బిడ్డ 19 ఏళ్ల రోషిణిపైనా కన్నేసినట్టు గీత గమనించింది.
ఓ రోజు తప్పతాగి వచ్చిన మెదిన్ లాల్ తన బిడ్డను లైంగికంగా వేధించాడు. దీంతో తల్లీ, బిడ్డ ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని ఎదుర్కొన్నారు. మెదిన్ లాల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆగస్టు 20వ తేదీన గీత, రోషిణిలు మెదిన్ లాల్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచారు.
మెదిన్ లాల్ ఆ తర్వాత ఇంటికి వెల్లాడు. ఇంటికి వచ్చిన మెదిన్ లాల్‌ను కర్రలతో కొట్టారు. గొంతు నులిమి చంపేశారని పోలీసులు తెలిపారు. మెదిన్ లాల్‌ను చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీని తల్లీ బిడ్డలు బెడ్ షీట్‌లో చుట్టి 100 మీటర్లకు దూరంలో పడేశారు. ఆ మరుసటి రోజు ఆగస్టు 21వ తేదీన డెడ్ బాడీ లభించింది.
ఈ నేరానికి పాల్పడినట్టు తల్లి, బిడ్డలు నేరాన్ని అంగీకరించారు. వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపించినట్టు రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు.
