చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దోమల మందు బాటిల్ పేలడంతో ఓ ఇంట్లోని ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడ్డారు.
చెన్నై : తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లో దోమలు రాకుండా చేసిన ఏర్పాటు నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇంట్లో దోమల మంది బాటిల్ పేలడంతో ఊపిరాడక నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
