New Delhi: ఈ ప్రభుత్వ పోర్టల్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన 121 సేవలు, పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన 100 సేవలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 72 సేవలు, వ్యక్తిగత ప్రజా ఫిర్యాదులు అండ్ పెన్షన్ మంత్రిత్వ శాఖ 60 సేవలు, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన 46 సేవలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 39 సేవలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 38 సేవలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సేవలను ఈ పోర్టల్ ద్వారా అందుతాయని ప్రభుత్వం తెలిపింది.
Government Portal: ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం ఆన్ లైన్ మోడ్ లో సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం అనేక వెబ్ సైట్లను ప్రారంభించింది. వీటి సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనిని పూర్తి చేయవచ్చు. కానీ చాలా సార్లు ఈ వెబ్ సైట్ల గురించి మనకు తెలియదు. దానివల్ల ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తోంది. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అలాగే, ప్రభుత్వ పత్రాలను సిద్దం చేయడం, వారి ముఖ్యమైన ప్రభుత్వ పనులను చేయలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్న క్రమంలో పథకాలు, ప్రభుత్వ పనుల ప్రయోజనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని రూపొందించింది. సరికొత్త ప్రభుత్వ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ పనులు చేయవచ్చు. ఇంట్లో కూర్చొని 13,000కు పైగా పనులను సులభంగా పూర్తి చేసే అటువంటి ప్రభుత్వ వెబ్ సైట్ గురించి వివరాలు ఈ కింది విధింగా ఉన్నాయి..
13 వేలకు పైగా సేవలు అందిస్తుంది..
13 వేలకు పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్న ఈ పోర్టల్ పేరు https://services.india.gov.in. ఇందులో ఏ పౌరుడైనా 13,350 సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డు పాన్ కార్డును లింక్ చేయాలా, ప్రభుత్వ వేలంలో పాల్గొనాలా, మీ పన్నును తెలుసుకోవాలన్నా లేదా మీరు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాలన్నా, ఈ వెబ్సైట్ కు వచ్చిన తర్వాత మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. దీని కోసం మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మొత్తం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవడంతో పాటు సంబంధిత పత్రాలను పొందవచ్చు.
అందుబాటులో ఉన్న సేవలు ఏమిటంటే..?
ఈ ప్రభుత్వ పోర్టల్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన 121 సేవలు, పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన 100 సేవలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 72 సేవలు, వ్యక్తిగత ప్రజా ఫిర్యాదులు అండ్ పెన్షన్ మంత్రిత్వ శాఖ 60 సేవలు, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన 46 సేవలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 39 సేవలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 38 సేవలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సేవలను ఈ పోర్టల్ అందుతాయని ప్రభుత్వం తెలిపింది. వీటిలో మీరు మీకు ఇష్టమైన సేవను ఎంచుకోవచ్చు.. ఆయా ఆఫీసులకు వెళ్లకుండానే దానిని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ పోర్టల్ లోకి ఎలా వెళ్లాలి..?
మీకు ప్రభుత్వం నుంచి ఏవైనా సేవలు పొందాలనుకున్నా, మీకు ఏవైనా పనులు ఉంటే ముందుగా services.india.gov.in లింక్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కుడివైపు అన్ని కేటగిరీలపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఏ సేవలు తీసుకోవాలన్నా సంబంధిత సూచనలు పాటిస్తూ కొనసాగించాలి. పాస్ పోర్ట్ కోసం అప్లై చేయాలంటే వీసా, పాస్ పోర్ట్ పై క్లిక్ చేయండి. అప్లై ఆన్ లైన్ పాస్ పోర్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాస్ పోర్ట్ సేవా పోర్టల్ కు చేరుకుంటారు. ఇప్పుడు పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోండి. ఇలా మనకు కావాల్సిన సేవలు పొందడానికి, సమయం ఆదా చేయడానికి, ఆన్ లైన్ లో సేవలు పొండగానికి ఈ ప్రభుత్వ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
