గతేడాది అక్టోబర్ లో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మోర్బీ వంతెన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు ఒరేవా కంపెనీని ఆదేశించింది. క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందించాలని పేర్కొంది.
గత ఏడాది అక్టోబర్ లో గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిన ప్రమాదంలో 135 మందిని చనిపోయారు. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 4 వారాల్లోగా నష్టపరిహారం అందించాలని గుజరాత్ హైకోర్టు ఒరేవా గ్రూప్ ను బుధవారం ఆదేశించింది. మృతి చెందిన వారికి రూ.10 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ మొత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెల్లించిన రూ.10 లక్షలకు అదనంగా ఉంటుందని పేర్కొంది.
తమిళనాడు కృష్ణగిరిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు
ఈ మేరకు గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సోనియా గోకాని, జస్టిస్ సందీప్ భట్ బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెనను నిర్వహిస్తున్న ఒరేవా గ్రూప్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఈ ఒక్క ఘటనతో బాధితుల జీవితాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దానిని ఎవరూ పూడ్చలేరని, ఇది కేవలం ప్రయత్నం మాత్రమేనని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలన్న కంపెనీ ప్రతిపాదన సరిపోదని ధర్మాసనం తోసిపుచ్చింది. ఒరేవా కంపెనీ ఇస్తామని చెబుతున్న నష్టపరిహారం ఆఫర్ తమ బాధ్యత నుంచి తప్పించుకోదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. కర్ణాటకలో ఘటన..
పరిహార మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు ప్రైవేటు సంస్థ 55 శాతం చెల్లించాలని, మిగిలినది రాష్ట్ర నిధుల నుండి వస్తుందనే సుప్రీంకోర్టు పరిశీలనను కోర్టు ఉదహరించింది. గత ఏడాది అక్టోబర్ 30 సాయంత్రం మచ్చు నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి కూలి 35 మంది చిన్నారులు సహా 135 మంది సందర్శకులు మరణించారు.
సుప్రీంలో పన్నీరు సెల్వంకు షాక్: మద్రాస్ హైకోర్టు తీర్పు సమర్ధన
వంతెన మరమ్మతు, నిర్వహణ కాంట్రాక్టును గడియార తయారీ సంస్థ ఒరెవాకు అప్పగించారు. అయితే ఆ సంస్థ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే మోర్బి మునిసిపాలిటీ నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఆ బ్రిడ్జిని సందర్శకుల కోసం వంతెనను తిరిగి తెరిచింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆ సమయంలో దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది.
