Asianet News TeluguAsianet News Telugu

సీ ఓటర్-ఇండియా టుడే సర్వే: మోడీకి తగ్గని ప్రజాదరణ, బీజేపీకి ప్రాంతీయ పార్టీలతో సవాల్

సీ ఓటర్- ఇండియా టుడే సర్వేలో మోడీకి ప్రజాదరణ తగ్గలేదు. బీజేపీకి ప్రాంతీయ పార్టీలతో సవాల్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి 20 శాతం ఓట్లు మాత్రమే రానున్నాయి. 

Mood Of The Nation poll: Narendra Modi continues to dominate
Author
New Delhi, First Published Jan 21, 2022, 10:02 AM IST

న్యూఢిల్లీ: దేశంలో ప్రధాని Narendra Modiకి ప్రజాదరణ తగ్గలేదు. సీ ఓటర్, ఇండియా టూడే నిర్వహించిన Survey  ఈ విషయాన్ని వెల్లడించింది.
మోడీ ప్రభుత్వ పనితీరుపై 58 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు. మరోవైపు 26 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు. 2021 ఆగష్టు మాసంలో నిర్వహించిన సర్వేతో పోల్చితే అసంతృప్తి 8 శాతం పెరిగింది.

ప్రధాన మంత్రిగా మోడీ 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న సమయంలో  ఈ సర్వే జరిగింది. ప్రధాని మోడీ పనితీరును 63 శాతం మంది ప్రశంసించారు. ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్ వంటి మహోన్నతమైన ప్రజాధరణ పొందిన  ప్రధానమంత్రిగా కూడా కొనసాగారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో Bjp  విజయం సాధించాలంటే మోడీ వ్యక్తిగత చరిష్మా, ప్రజాదరణ కూడా Votersను ప్రభావితం చేయనుంది.  దేశంలోని పది మంది ముఖ్యమంత్రుల పనితీరు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. అయితే బీజేపీకి చెందిన  అసోం కు చెందిన హిమంత బిస్వా శర్మ మాత్రమే ఈ పదిమందిలో ఉన్నారు. మిగిలిన బీజేపీ దాని మిత్రపక్షమైన ఎన్డీఏ సీఎంలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని ఈ సర్వే తెలిపింది.  2017 నుండి ఇదే తరహలోనే  బీజేపీ సీఎంల పనితీరుపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

2017లో జరిగిన ఎన్నికల్లో uttarpradesh రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించింది. అయితే మోడీ ప్రవేశ పెట్టిన పథకాలే ఈ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చాయి.ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది.

2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వసుంధర రాజే సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ వంటి నేతలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది.

బీజేపీకి సవాల్ విసురుతున్న ప్రాంతీయ పార్టీలు

బీజేపీ ఆధిపత్యానికి ప్రాంతీయ పార్టీలు సవాల్ విసురుతున్నాయి.  జార్ఖండ్ లో బీజేపీని హేమంత్ సోరెన్  నేతృత్వంలోని జేఎంఎం కూటమి మట్టికరిపించింది. మహారాష్ట్రలో శరద్‌పవార్, శివసేన ఉద్దవ్ ఠాక్రే లతో పాటు కాంగ్రెస్ లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

2020 ప్రారంభంలో Delhiలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ను ప్రారంభించి బీజేపీని దెబ్బకొట్టారు.అదే ఏడాది బీహార్ లో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ ను కాకుండా నిలువరించడానికి ఎంఐఎం, కాంగ్రెస్ పరోక్షంగా సహకరించిందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, కేరళలలో కూడా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.

మరో వైపు బెంగాల్ రాష్ట్రంలోని 294 సీట్లలో బీజేపీ 77 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అసోం రాష్ట్రంలో బీజేపీ విజయం ఆ పార్టీకి కొంత ఉపశమనమే. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి లాభించలేదు.ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే బెంగాల్ లోని 42 సీట్లలో 35 స్థానాలను టీఎంసీ గెలుచుకొంటుంది. యూపీలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించే అవకాశం లేకపోలేదు.

కాంగ్రెస్ కు 20 శాతం ఓట్లు

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే Congress కు 20 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకేవలం 62 శాతం ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకొంటుందని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి. 44 స్థానాల నుండి 52 స్థానాల కంటే ఎక్కువగా ఎంపీ స్థానాలు దక్కుతాయని ఈ ఫలితాలు తెలిపాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios