ఒత్తిడికి తలొగ్గిన మోడీ సర్కార్: ఎట్టకేలకు అవిశ్వాసంపై చర్చకు సిద్ధం

Monsoon Session Of Parliament LIVE Updates: Lok Sabha, Rajya Sabha To Table Key Bills
Highlights

 పార్లమెంట్  వర్షాకాల సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విబజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ  కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది.  ఇదిలా ఉంటే ఈ సెషన్‌లో కీలకమైన పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని  కేంద్రం భావిస్తోంది.

న్యూఢిల్లీ: పార్లమెంట్  వర్షాకాల సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విబజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ  కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింది.  ఇదిలా ఉంటే ఈ సెషన్‌లో కీలకమైన పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని  కేంద్రం భావిస్తోంది

*అన్ని పార్టీల ఎంపీల తీర్మాణాలను చదవి విన్పించినట్టు స్పీకర్ ప్రకటించారు.

*టీడీపీ తీర్మాణం మాత్రమే చదివి విన్పించారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం చెప్పారు..

*10 రోజుల్లో అవిశ్వాస తీర్మాణంపై చర్చ ప్రవేశపెట్టే తేదీని ప్రకటించనున్నట్టు సుమిత్రా మహాజన్ ప్రకటించారు

*రూల్స్‌కు అనుగుణంగానే తాను అవిశ్వాస తీర్మాణంపై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ ప్రకటించారు

*టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు

*టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసులు అందాయని ప్రకటించిన స్పీకర్ మహజన్

*రాజ్యసభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై ఎప్పుడు చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మెన్ అభిప్రాయపడ్డారు.

*తాము ఇచ్చిన డిమాండ్లపై తక్షణమే చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ పట్టుబట్టారు
* రేపు కానీ, ఎల్లుండి కానీ  ప్రత్యేక హోదా అంశంపై చర్చకు సిద్దమని ప్రకటించిన రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
* రాజ్యసభలో చర్చకు సిద్దమని ఛైర్మెన్ ప్రకటించారు.

*ప్రారంభమైన రాజ్యసభ

*లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాతే ఇతర కార్యక్రమాలు చేపడుతానని ప్రకటించిన స్పీకర్ సుమిత్రా మహాజన్

*మధ్యాహ్నం 12 గంటలవరకు రాజ్యసభ వాయిదా

*రాజ్యసభ వాయిదా పడింది

* కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
* లోక్‌సభలో గందరగోళం
* అవిశ్వాసంపై చర్చకు టీడీపీ డిమాండ్
* స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన

 *టీడీపీ ఎంపీల ఆందోళన మద్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి

 *ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు

* ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ చేపట్టారు. ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపాన్ని ప్రకటించింది.

*కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రమాణం చేయించారు.

*రాజ్యసభలో కూడ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు


 

loader