rainfall: జూన్‌లో లోటు వర్షపాతం నమోదైందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నెలలో కురిసిన వర్షాల వల్ల రిజర్వాయర్లలో గత 10 సంవత్సరాల సగటు కంటే తక్కువ నీరు వచ్చిందని సమాచారం.
monsoon: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, గత నెల జూన్‌లో లోటు వర్షపాతం నమోదైందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నెలలో కురిసిన వర్షాల వల్ల రిజర్వాయర్లలో గత 10 సంవత్సరాల సగటు కంటే తక్కువ నీరు వచ్చిందని సమాచారం. జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ఏర్పడటంతో భారతదేశంలోని 30కి పైగా పెద్ద రిజర్వాయర్లలో గత ఏడాదితో పోలిస్తే తక్కువ నీరు చేరింది. అది మాత్రమే కాకుండా గత 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే చాలా తక్కువని గణాంకాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) వారానికోసారి 143 రిజర్వాయర్లను పర్యవేక్షిస్తుంది. జూన్ 30 నాటికి మొత్తం ప్రత్యక్ష నిల్వ 48.951 బిలియన్ క్యూబిక్ మీటర్లు (BCM)గా ఉంది. ఇది గత సంవత్సరం నిల్వలో 86 శాతం కాగా, ఇదే సమయంలో గత 10 సంవత్సరాల సగటు118 శాతంగా ఉంది. ఈ సారి చాలా తక్కువగా ఉంది. ప్రత్యక్ష నిల్వ లేని ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి.
“జూన్‌లో వర్షపాతం అస్థిరంగా ఉంది. పురోగతి నెమ్మదిగా ఉంది. రుతుపవనాలు ముందుకు రాకపోవడంతో రెండుసార్లు బ్రేక్ పడింది. అయినప్పటికీ, జూన్ చివరి వారంలో చాలా రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైంది” అని జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏజెన్సీకి చెందిన ఒక అధికారి తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మిజోరాం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, అండమాన్ & నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలి వంటి కేంద్రపాలిత ప్రాంతాలలకు సంబంధించిన భారత వాతావరణ శాఖ (IMD) డేటా పై వివరాలను వెల్లడించింది. జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైందని ఆయా గణాంకాలు పేర్కొన్నాయి.
CWC ప్రకారం ఉత్తర ప్రాంతంలో, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు రిజర్వాయర్‌లలో గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ నీరు ఉంది. అయితే గత 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే మైనస్ 38 శాతం ఎక్కువ. పంజాబ్‌లోని జలాశయం కూడా ఇదే తరహా పరిస్థితుల్లో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు అదే పరిమాణంలో నీరు ఉంది. అయితే గత 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే 37 శాతం తక్కువగా ఉంది. తూర్పు ప్రాంతంలోని జార్ఖండ్‌లోని ఆరు రిజర్వాయర్‌లు గత 10 సంవత్సరాల సగటులో మైనస్ 19 శాతం కలిగి ఉండగా, ఒడిశాలోని 10 రిజర్వాయర్‌లు గత 10 సంవత్సరాల సగటు నీటి పరిమాణంలో మైనస్ 39 శాతం కలిగి ఉన్నాయి. మధ్య ప్రాంతంలోని ఉత్తరాఖండ్‌లోని మూడు రిజర్వాయర్‌లలో గత 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే మైనస్ 21 శాతం తక్కువ నీరు ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది, ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు రిజర్వాయర్‌లకు ఇది గత 10 సంవత్సరాల సగటులో మైనస్ 8 శాతంగా ఉంది.
జూన్ నెలలో వర్షపాతం విషయానికి వస్తే (మైనస్ 30, మైనస్ 54 శాతం లోటు) ఉన్న గుజరాత్, మహారాష్ట్రలలో గత సంవత్సరంతో పోలిస్తే కొంచెం తక్కువ నీరు మాత్రమే ఉంది. అయితే గత 10 సంవత్సరాల సగటు కంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. జూన్ 30 నాటికి మైనస్ 52 శాతం లోటు ఉన్న కేరళలో కూడా దక్షిణ ప్రాంతంలోని రిజర్వాయర్లు ఏవీ లోటు చూపడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని రంగవాన్, ఉత్తరాఖండ్‌లోని నానక్ సాగర్, మహారాష్ట్రలోని ముల్షి, భీమా, గుజరాత్‌లోని వాత్రక్, మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్ రిజర్వాయర్‌లు జూన్ 30 నాటికి లైవ్ స్టోరేజీని కలిగి ఉన్నాయని CWC అధికారి ఒకరు తెలిపారని ఐఏఎన్ఎస్ నివేదించింది.
