న్యూఢిల్లీ:  ఈ ఏడాది జూన్ 4వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ ప్రకటించింది.అండమాన్ నికోబార్  దీవుల్లో ఈ నెల 22కు చేరుకొనే అవకాశం ఉందని స్కైమెట్ అభిప్రాయపడింది.

ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. మరో వైపు భారత వాతావరణ శాఖ మాత్రం ఈ దఫా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.