Heavy rains: రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, కొంకణ్, గోవా, కోస్టల్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (IMD) వెల్ల‌డించింది. 

Indian Meteorological Department: రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య భార‌తంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా అక్క‌డ వ‌ర‌ద‌లు పొటెత్తాయి. వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌ల్లో చ‌నిపోతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌లు కొసాగిస్తున్నామ‌ని ప్ర‌భుత్వాలు పేర్కొంటున్నాయి. రానున్న వారం రోజుల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చిర‌లు ప‌రిస్థితుల‌ను మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారుస్తున్నాయి. 

ఈ క్ర‌మంలోనే భార‌త వాతావ‌ర‌ణ విభాగం హెచ్చిర‌లు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో భారీ వ‌ర్సాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. మంగళవారం, గురువారం మధ్య వాయువ్య భారతదేశంలో చురుకైన రుతుపవన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని IMD తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో రుతుపవనాలు అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. భారత వాతావరణ శాఖ అంచ‌నా వేసిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మధ్య భారతదేశం, పశ్చిమ తీరం వెంబడి చురుకైన రుతుపవనాల పరిస్థితులు రానున్న ఐదు రోజులలో ఆశ‌జ‌న‌కంగా ఉంటాయి. వాయువ్య భారతదేశంలో మంగళవారం, గురువారం మధ్య క్రియాశీల రుతుపవన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొంది.

వాతావ‌ర‌ణ విభాగం తాజా అంచ‌నాలు ఇలా ఉన్నాయి.. 

1) రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, కొంకణ్, గోవా, కోస్టల్-సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తన బ్రీఫింగ్‌లో తెలిపింది.

2) సోమవారం, గురువారం మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర అంతర్గత కర్ణాటకలో మంగళవారం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

3) సోమవారం నుండి గురువారం వరకు కొంకణ్, గోవాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం నుండి మంగళవారం వరకు కోస్తా కర్ణాటక, గుజరాత్ మీదుగా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు మంగళవారం నుండి గురువారం వరకు వ‌ర్సాలు కురుస్తాయి. 

4) రాబోయే నాలుగు రోజుల్లో మధ్య భారతదేశం (మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ)లో ఉరుములు మెరుపులతో కూడిన విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

5) సోమ, గురువారాల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన బులెటిన్‌లో తెలిపింది.

6) జమ్మూ కాశ్మీర్, ప‌శ్చిమ‌ రాజస్థాన్‌లలో మంగళవారం నుండి గురువారం వరకు, హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

7) ఉత్తరాఖండ్‌లో మంగళవారం నుండి గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.

8) పంజాబ్, హర్యానా-చండీగఢ్, వాయువ్య ఉత్తరప్రదేశ్ బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

9) ఢిల్లీలో సోమవారం తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షంతో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని IMD అంచనా వేసింది.

10) బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. పశ్చిమ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులకు కూడా ఇదే హెచ్చరిక జారీ చేశారు.