New Delhi: బిపర్జోయ్ తుఫాన్, ఎల్ నినో ప్ర‌భావంతో రుతుపవనాల విస్తరణ ఆలస్యం అయింది. అయితే, ఇప్పుడు గాలులు బలపడుతున్నాయని వాతావరణ శాఖ  అధికారులు తెలిపారు. బిపర్జోయ్ తుఫాను తేమను దూరం చేసిందనీ, అందుకే రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని వివరించారు. జులై మొదటి 10 రోజుల వరకు వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని ప్ర‌యివేటు సంస్థ స్కైమెట్ పేర్కొంది.  

Monsoon 2023: రానున్న మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఊపందుకునే అవకాశం ఉందనీ, దక్షిణ, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో వరి, సోయాబీన్, పత్తి, చెరకు పండించే ప్రాంతాలను ఇది కవర్ చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. భారతదేశ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన రుతుపవనాలు.. పంట‌లు పండించే పొలాల‌కు నీరు పెట్టడానికి, జలాశయాలు నింప‌డానికి అవ‌స‌సరమైన 70 శాతం వర్షపాతాన్ని అందిస్తాయి. వేసవి తాపం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. భారతదేశ నైరుతి తీరంలోని కేరళ రాష్ట్రంలో సాధారణంగా జూన్ 1 నాటికి రుతుప‌వ‌నాలు చేరుకోవ‌డంతో వర్షాలు కురుస్తాయి. జూన్ మధ్య నాటికి దేశంలోని దాదాపు సగం భాగాన్ని కవర్ చేస్తాయి. అయితే, ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను రుతుపవనాల రాకను ఆలస్యం చేసి, ఇప్పటివరకు దేశంలో మూడింట ఒక వంతుకు మాత్రమే దాని పురోగతిని పరిమితం చేసింది. 

బిపర్జోయ్ తుఫాన్, ఎల్ నినో ప్ర‌భావంతో రుతుపవనాలు ఆలస్యం అయ్యాయి. కానీ ఇప్పుడు గాలులు బలపడుతున్నాయని అధికారులు తెలిపారు. బిపర్జోయ్ తుఫాను తేమను దూరం చేసిందనీ, అందుకే రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని వివరించారు. జులై మొదటి 10 రోజుల వరకు వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని ప్ర‌యివేటు సంస్థ స్కైమెట్ పేర్కొంది. ప్ర‌స్తుతం రుతుపవనాలు బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ వారాంతం నుంచి దేశంలోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పత్తి, సోయాబీన్స్, పప్పుధాన్యాలు ప్రధానంగా దేశంలోని మధ్య ప్రాంతాలలో పండించబడుతున్నాయి. ఈ సారి వ‌ర్షాలు ఆల‌స్యం కావ‌డం పంట‌ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం లేక‌పోలేద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

జూన్ లో ఇప్పటివరకు సాధారణం కంటే 33% తక్కువ వర్షపాతం నమోదైంది, అయితే కొన్ని రాష్ట్రాల్లో లోటు 95% వరకు ఉంది. ప్రస్తుతం తమకున్న సమాచారం ప్రకారం ఈ వారం రుతుపవనాల వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. జూన్ లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందనీ, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రుతుపవనాలు పుంజుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఎల్ నినో వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం నాలుగు నెలల సీజన్ లో సగటున వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.

పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల ఏర్పడిన బలమైన ఎల్ నినో ఆగ్నేయాసియా, భారత్, ఆస్ట్రేలియాల్లో తీవ్ర కరువుకు కారణమవుతుందనీ, అమెరికా మిడ్ వెస్ట్, బ్రెజిల్ వంటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను వర్షంతో ముంచెత్తుతుందని వాతావ‌ర‌ణ శాఖల నివేదిక‌లు పేర్కొంటున్నాయి. బలమైన ఎల్ నినో ఆవిర్భావం 2014, 2015 సంవత్సరాల్లో వరుస కరువులను ప్రేరేపించింది. ఇది ఒక శతాబ్దంలో నాలుగవసారి.. ఇది భారతీయ రైతులను తీవ్రమైన పేదరికంలోకి నెట్టింది.