బాంబులు విసిరిన కోతులు.. ముగ్గురికి తీవ్రగాయాలు.. యూపీలో హాట్ టాపిక్

Monkeys Found Bombs In Fatehpur uttarpradesh
Highlights

కోతులు బాంబులు వేయడం ఏంటీ అనుకొని ఆశ్చర్యపోకండి.. ఇది కట్టుకథ కాదు నిజం.

కోతులు బాంబులు వేయడం ఏంటీ అనుకొని ఆశ్చర్యపోకండి.. ఇది కట్టుకథ కాదు నిజం. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ గ్రామానికి చెందిన గులాబ్ గుప్తా పాఠశాలకు వెళ్లిన మనవడు ఇంటికి తిరిగి వచ్చే సమయం కావడంతో మరో మనవడి కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తున్నాడు.. ఈ క్రమంలో గోడ మీదుగా వెళ్తున్న కోతులు నోటితో పట్టుకున్న పాలిథిన్ సంచిని వారిపై జారవిడిచాయి.. అంతే పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది.

ఏం జరిగిందో ఏంటోనని స్థానికులు పరుగుపరుగున వచ్చి చూసేసరికి తీవ్రగాయాలతో తాతమనవళ్లు కనిపించడంతో వారిని ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. చెత్త డబ్బా నుంచి కానీ.. డంపింగ్ యార్డ్ నుంచి కానీ అది తినే పదార్థమని భావించి నోటకారుచుకుని ఉండవచ్చని.. దానితో ఆడుకుంటుండగా కిందపడి పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 

loader