Asianet News TeluguAsianet News Telugu

Monkeypox: కేర‌ళ‌లో మ‌రో అనుమానిత మంకీపాక్స్ కేసు.. క‌న్నూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన అధికారులు

Kerala: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది కేసులు, ఒక మ‌ర‌ణం న‌మోదైంది. మొత్తం 9 కేసుల్లో 4 కేసులు ఢిల్లీకి చెందినవి కాగా, మిగిలిన ఐదు కేరళలో నమోదయ్యాయి.
 

Monkeypox : Another suspected monkeypox case in Kerala;  Officials rushed to Kannur hospital
Author
Hyderabad, First Published Aug 8, 2022, 2:17 PM IST

 Monkeypox Suspected Case: దేశంలో మంకీపాక్స్ ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. కేరళలో మ‌రో అనుమానిత మంకీపాక్స కేసు న‌మోదైంది. ఏడేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ అనుమానిత లక్ష‌ణాల‌ను గుర్తించారు. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఆ చిన్నారిని కేరళలోని కన్నూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చినట్లు స‌మాచారం. ఆ చ‌న్నారి విదేశీ ప్ర‌యాణాలు చేసిన రిపోర్టులు ఉన్నాయ‌ని అధికారులు గుర్తించారు. UK నుండి ఇటీవ‌ల‌ తిరిగి వచ్చాడు. అత‌ను ప్ర‌స్తుతం మంకీపాక్స్ కు సమానమైన లక్షణాలను కలిగి ఉన్నాడు. అత‌ని శాంపిళ్ల‌ను తీసుకున్న కేర‌ళ ఆరోగ్య శాఖ అధికారులు పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ప్రత్యేకంగా రూపొందించిన ఐసోలేషన్ గదిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 

కాగా, భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం తొమ్మిది మంకీపాక్స్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో నాలుగు దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌మోదుకాగా, మిగిలిన కేసులు ద‌క్షిణ రాష్ట్రమైన కేర‌ళ‌లో వెగులుచూశాయి. అలాగే, ఒక‌రు మంకీపాక్స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో భార‌త్ లో మంకీపాక్స్ భ‌యాందోళ‌న‌లు పెరుగుతున్నాయి. 

భార‌త్ లో మంకీపాక్స్ కు సంబంధించిన టాప్-10 పాయింట్లు ఇలా ఉన్నాయి.. 
 
1. దేశంలో గుర్తించిన మొత్తం 9 కేసుల్లో 4 కేసులు ఢిల్లీకి చెందినవి కాగా, మిగిలిన ఐదు కేరళలో నమోదయ్యాయి.

2. ICMR గుర్తించిన వివ‌రాల ప్ర‌కారం.. మొదటి రెండు మంకీపాక్స్ కేసుల విశ్లేషణలో UAE నుండి తిరిగి వచ్చిన ఇద్ద‌రిలో మంకీపాక్స్ వైరస్ జాతి A.2 బారిన పడ్డారు. ఇది ఐరోపాలో మంకీపాక్స్ వ్యాప్తికి కారణమయ్యే దానికి భిన్నంగా ఉంది.

3. గత సంవత్సరం USలో కనుగొనబడిన A.2 జాతి ప్రధాన సమూహాలకు లింక్ చేయబడలేదు. ప్రస్తుత వ్యాప్తి మంకీపాక్స్ వైరస్  బి.1 స్ట్రెయిన్ ద్వారా కొన‌సాగుతున్న‌ద‌ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) సీనియర్ శాస్త్రవేత్త, అధ్యయనానికి సంబంధించిన ప్రధాన రచయిత డాక్టర్ ప్రగ్యా యాదవ్ చెప్పారు.

4. బీహార్, గుజరాత్‌లలో మంకీపాక్స్ బారిన పడిన అనుమానిత రోగులు వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు ప్రతికూలంగా పరీక్షించారు.

5. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు చేయవలసిన, చేయకూడని వివిధ అంశాల‌తో కూడిన ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. 

6. ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో మంకీపాక్స్ సోకిన వ్య‌క్తికి దూరంగా ఉండాల‌ని పేర్కొంది. అలాగే, అత‌నిని ఇత‌రుల‌కు దూరంగా ఉంచి చికిత్స అందించాల‌ని సూచించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల మంకీపాక్స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌ని తెలిపింది. అలాగే, రోగి ఉన్న ప్రాంతాల‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాల‌ని తెలిపింది. 


7. మంకీపాక్స్ సోకిన వ్య‌క్తిని క‌లిసే స‌మ‌యంలో అత‌న్ని నేరుగా ముట్టుకోకుండా చేతుల‌కు గ్లోవ్స్ పెట్టుకోవ‌డం చేయాలి. అలాగే, మాస్కులు ధ‌రించాలి. చేతుల‌ను స‌బ్బు లేదా నీటితో క‌డుక్కొవాలి. 

8. మంకీపాక్స్ సోకిన వ్య‌క్తులు ఉప‌యోగించిన‌ నార, పరుపులు, బట్టలు, తువ్వాలు, ఇతరులతో పంచుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, వారి దుస్తుల‌ను సాధార‌ణ వ్య‌క్తుల దుస్తుల‌తో క‌లిపి లాండ్రీ చేయ‌వ‌ద్ద‌ని పేర్కొంటున్నారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో పాటు బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు వెళ్ల‌కుండా ఉండాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. 

9. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. అలాగే, మంకీపాక్స్ వ్యాప్తి నిరోధించ‌డంతో పాటు దీనిని ప‌రిష్క‌రించ‌డానికి తీసుకోవాల్సిన ప్ర‌తిస్పంద‌న కార్య‌క్ర‌మాల‌పై నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. 

10. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు సాధారణంగా వ‌చ్చే జ్వరం, దద్దుర్లు, వాపుతో కూడిన‌ శోషరస కణుపులు ఏర్ప‌డుతాయి. దీంతో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్త‌వ‌చ్చు. ఇక మంకీపాక్స్ వ్యాప్తిని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే గ్లోబ‌ల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios